పుంగనూరులో పురాతన శాసనం పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలంలోని శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న పురాతన శాసనాన్ని శుక్రవారం చరిత్ర అధ్యాపకులు కందులసావిత్రి , ఆంజనేయరెడ్డిలు పరిశీలించారు. ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ చోళులకాలంలో నిర్మించిన పురాతన ఆలయం వద్ద ఉన్న శాసనాన్ని గుర్తించామన్నారు. ఈ శాసనాన్ని మైసూర్‌లోని పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపి వివరాలు సేకరించామన్నారు. 1674 సంవత్సరంకు చెందిన ఈ శాసనం తెలుగు అక్షరాలను పోలి బైరుకూరుకు చెందిన అమ్మజమ్మ మనువడు, వారి కుటుంబ సభ్యులు కలసి శివాలయం మండపం కట్టించినట్లు పేర్కొన్నారని తెలిపారు. అలాగే ఆలయంలో మరోక శాసనం ఉందని దానిపై కూడ పరిశోదన చేస్తున్నట్లు తెలిపారు. పురాతన ఆలయాలకు సంబంధించి శాసనాలను పరిశీలించి వాటి చరిత్రను తెలియజేస్తామన్నారు.

Tags;Examination of Ancient Inscriptions at Punganur
