Natyam ad

సీఎం పర్యటన నేపధ్యంలో ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్ ప్రారంభించేందుకు త్వరలో రానున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  కెవిఎన్ చక్రధర్ బాబు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్  బి. శ్రీధర్ తో కలిసి పరిశీలించారు.
ముఖ్యమంత్రి  ఈనెల 27వ తేదీన జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.  తొలుత జిల్లా కలెక్టర్, ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా పోలీసు అధికారి  సిహెచ్ విజయ రావు, ఏపీ జెన్కో రాష్ట్ర డైరెక్టర్  చంద్రశేఖర్ రాజు లతో కలసి శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో  యూనిట్ పరిధిలో సిబ్బంది క్వార్టర్ల సమీపంలో హెలిప్యాడు, బహిరంగ సభ వేదిక స్థలాలను, నిర్మాణంలో ఉన్న పైలాన్ ను పరిశీలించారు.  ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకల గురించి వారు చర్చించారు.

 

 

వర్షాలు పడే సూచన ఉన్నందున అందుకు తగినట్టుగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఏపీ జెన్కో పరిపాలన భవనం సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన థర్మల్ పవర్ స్టేషన్ నమూనాను పరిశీలించారు. తదుపరి సెంట్రల్ కంట్రోల్ గదిలోని మూడవ యూనిట్ను వారు పరిశీలించారు.ఈ పర్యటనలో వెంట ఏపీ జెన్కో సి ఇ  నాగరాజు, ఎస్.ఈ.లు  వెంకటేశ్వరరావు,  మధుసూదన్ రావు,  జగన్నాథం,  చౌదరి నెల్లూరు ఆర్డిఓ  మలోల, నుడా వైస్ చైర్మన్  టీ బాపిరెడ్డి, ఏఎస్పీ  శ్రీనివాసరావు,ఆర్ అండ్ బి ఎస్ ఈ  మాధవి సుకన్య, డీఎస్పీ  హరినాథ్ రెడ్డి, తహసిల్దార్  మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Examination of the arrangements in the context of the CM’s visit

Post Midle