ఘనంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు.

Excellent MLA Peddireddy's birthday celebrations.

Excellent MLA Peddireddy's birthday celebrations.

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపిపి నరసింహులు, వైస్‌ ఎంపిపి రామచంద్రారెడ్డి, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, రెడ్డెప్ప, నాగరాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, లయన్స్క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ, ఆధ్వర్యంలో అభిమానులు కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పట్టణంలోని దివంగత రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద పెద్దిరెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దిరెడ్డి జిందాబాద్‌… కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంటు నినాదాలు చేసి, సంబరాలు జరుపుకున్నారు. అలాగే పట్టణంలోని నక్కబండలో డాక్టర్లు ఆనందరావు, పవిత్రన్‌, ప్రవీన్‌ల ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్లు రేష్మ, మంజుల, అమ్ము, మనోహర్‌, ఇబ్రహిం, నయాజ్‌తో పాటు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బిటి అతావుల్లా, కిజర్‌ఖాన్‌, యశ్వంత్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ శంకరప్ప, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దిక్‌, యువజన సంఘనాయకులు , సురేష్‌, కుమార్‌, చందారెడ్డెప్పరెడ్డి, హేము, అయాజ్‌, నిజాం, ఇర్ఫాన్‌, తదితరులు పాల్గొన్నారు.

 

జనసేనలోకి మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

Tags: Excellent MLA Peddireddy’s birthday celebrations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *