ఘనంగా ఎన్టీఆర్ 22 వ వర్ధంతి వేడుకలు

Excellent NTR 22nd trade ceremonies

Excellent NTR 22nd trade ceremonies

-లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు

Date:18/01/2018

పలమనేరు ముచ్చట్లు:

మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతిని స్థానిక తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదానమే మహాదానంగా భావించి పలువురు తెదేపా, నందమూరి అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆ మహనీయుడికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, ఆర్బీసి కుట్టి, కిషోర్, కౌన్సిలర్లు, వికోట,బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండల నాయకులు పాల్గొన్నారు.

Tags: Excellent NTR 22nd trade ceremonies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *