విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి

Excellent results in power field: Minister Jagadish Reddy

Excellent results in power field: Minister Jagadish Reddy

Date:17/07/2018
సూర్యాపేట ముచ్చట్లు:
విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు సాధించగలిగామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్‌ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమమే విద్యుత్ సమస్య మీదనే మొదలైందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా విద్యుత్ రంగం చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజులకే విద్యుత్ సమస్యను అధిగమించగలిగామని మంత్రి తెలిపారు.ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ విద్యుత్ రంగం గురించి మాట్లాడుకుంటున్నదని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా వెనుకాల సీఎం కేసీఆర్ కృషి అనిర్వచనీయమైనదని చెప్పారు. లో వోల్టేజీ సమస్యను నివారించడంలో విద్యుత్ శాఖ అద్భుత ఫలితాలు సాధించిందని వెల్లడించారు. శాంతినగర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఈ ప్రాంతంలో లో వోల్టేజీ సమస్యను అధిగమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ నిర్మించిన సబ్‌స్టేషన్‌తో3,250 మంది గృహ వినియోగదారులకు2,500 మంది వ్యవసాయదారులకు120మంది పారిశ్రామివేత్తలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి https://www.telugumuchatlu.com/excellent-results-in-power-field-minister-jagadish-reddy/
Tags:Excellent results in power field: Minister Jagadish Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *