ప్రభుత్వం నుంచి అనుమతులు తప్ప- ఎటువంటి సహకారం లేదు

ఆనందయ్య కీలక వ్యాఖ్యలు
నెల్లూరు ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఔషధం పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య స్పష్టం చేశారు .కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదంటూ ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీకి వనరులు సమకూరడం లేదని, విద్యుత్‌ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప, ఇప్పటివరకు ఎటువంటి సహకారం లేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామంటూ ఆయన వెల్లడించారు.అయితే మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని నియోజవర్గంలోనే పాజిటీవ్ బాధితుల ఇంటి వద్దకే మందు చేర్చాలని చూస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కృష్ణపట్నంలో పూర్తి అయిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు మందు పంపిణీ చేస్తామని తెలిపారు. మందు కావలసినవారు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ఆనందయ్య సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందని ఆనందయ్య పేర్కొన్నారు. కాగా ఆనందయ్య కరోనా మందుకు ‘ఔషధచక్ర’గా నామకరణం చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Except for approvals from the government- no cooperation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *