డేటింగ్ యాప్స్ అన్వేషణలో అతివలు

హైదరాబాద్      ముచ్చట్లు :
ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వాడకం విరివిగా పెరిగింది. లాక్డౌన్ కారణంగా ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఇది ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా డేటింగ్ యాప్స్ కి మగవాళ్ళ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మహిళలు కూడా డేటింగ్ యాప్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా వివాహిత మహిళల శాతం ఎక్కువగా పెరుగుతుందని తాజా సర్వే వెల్లడి చేసింది.వివాహం చేసుకున్న తర్వాత ఇతర సంబంధాలు కలుపుకోవడం మోసపూరితం అవుతుందని తెలిసినా, ఈ విషయంలో మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని సర్వే సారాంశం. డేటింగ్ యాప్స్ వాడుతూ వర్చువల్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ కొందరు ఉంటుంటే, మరికొందరు ఇంకా ముందుకు వెళ్ళి, ఆ రిలేషన్ ని సాధారణ బంధంలా మార్చుకుంటున్నారు. ఇవన్నీ తమ భాగస్వామికి తెలియకుండానే జరుగుతున్నాయి.ప్రస్తుతం మహిళలకి ఆర్థిక భద్రత, విద్యా, పెరిగింది. అదీగాక సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ విధంగా డేటింగ్ యాప్స్ కి ట్రాఫిక్ పెరగడానికి కారణం అని అంటున్నారు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో డేటింగ్ యాప్స్ వాడకమూ ఎక్కువే. మహిళలో పెరుగుతున్న అభద్రత కూడా ఇలా డేటింగ్ యాప్స్ పై ఆకర్షితులవడానికి కారణంగా నిలుస్తుంది.అరచేతిలో అంతర్జాలం అందుబాటులో ఉంది. లాక్డౌన్ భయాలు, బోరింగ్, ఒత్తిడి, యాంగ్జాయిటీ, ఒంటరితనం భరించలేకపోవడం, తోడు కావాలని కోరుకోవడం, మృదువైన మాటలు, శారీరక సంబంధం లేని సురక్షిత వ్యవహారం మొదలగునవన్నీ వివాహిత మహిళలు డేటింగ్ యాప్స్ వైపు మళ్ళడానికి కారణంగా ఉంటున్నాయని ఈ సర్వే వెల్లడి చేసింది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Excessive in search of dating apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *