Natyam ad

మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం -రవాణాశాఖాధికారి రవీంద్రనాయక్‌

పుంగనూరు ముచ్చట్లు:

రహదారి భద్రతలను పాటించకుండ మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పుంగనూరు రవాణాశాఖాధికారి రవీంద్రనాయక్‌ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెటిసి బషిరెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు భద్ర త వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలలో అధికంగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే సమయంలో మధ్యం సేవించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడటం , రోడ్డు భద్రతను పాటించకుండ మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతోందన్నారు. ప్రమాదాలలో రోడ్డుపై వెళ్తున్న అమాయకులు బలౌతున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు వహించి వాహనాలకు ఇన్సూరెన్స్లు , పిల్లలకు డ్రైవింగ్‌ లైసెన్సులు పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు నివారించేందుకు తల్లిదండ్రులు , ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ పురుషోత్తంరెడ్డి, వాహనడ్రైవర్లు, యజమానులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Excessive speed is the cause of accidents – Transport Officer Ravindra Naik

 

Post Midle