40 కోట్లకు పైగా ఆస్తులతో ఎక్సైజ్ సీఐ

Date:11/08/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా నాగలాపురం చెక్‌పోస్టు ఎక్సైజ్‌ సిఐ విజయకుమార్‌ ఇంట్లో  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తుల‌ను గుర్తించారు. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులందడంతో ఈ దాడులు నిర్వహించారు. చిత్తూరులోని విజయ్‌కుమార్‌ ఇంటితో పాటు స్నేహితుడు, తిరుపతిలో ఆయన సోదరి, తమిళనాడులోని కాడ్పాడి, పని చేసిన కర్నూలు సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు.ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ సోదాలు సాగాయి. విజయ్‌కుమార్‌ ఇంట్లో దాదాపు రూ. 40 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని కాజూరు వద్ద గల విజయకుమార్‌ నివాసానికి సమీపంలోని ఓ షెడ్‌లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ నగదు, బంగారు ఆభరణాలు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను గుర్తించారు. వీటి విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఆయన ఒక్క చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోనే ఆరు చోట్ల భూమిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. గతంలో స్పిరిట్‌ అక్రమ రవాణా కేసులో నిందితునిగా ఉన్నారు. అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో విజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు.
Tags:Excise CI with over 40 crore assets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *