ఎక్సైజ్ శాఖ 100 రోజుల ప్రత్యక్ష కార్యాచరణ

Excise Department is 100 days live functional

Excise Department is 100 days live functional

Date:11/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎమ్మార్పీకి మించి జరిపే అమ్మకాలు, అక్రమ గుడుంబా తయారీ వంటి కార్యకలాపాలపై  మద్యనిషేధం, ఎక్సైజ్ విభాగం 100 రోజుల ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్ మెంట్ కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.100 రోజుల ప్రణాళిక ఖరారుకు ముందు తొలుత తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనుంచి మండలస్థాయిలో ప్రస్తుతానికి, భవిష్యత్ పరిస్థితులకు సరిపోయేవిధంగా చేపట్టగలిగిన ఎన్‌ఫోర్స్ మెంట్ కార్యకలాపాలపై పలువర్గాలనుంచి చాలా సమాచారం సేకరించారు.అంతర్గతంగానూ, బయటినుంచికూడా సేకరించిన ఈ సమాచారం ఆధారంగా మండల, జిల్లా స్థాయిల్లో కార్యాచరణ ప్రణాళికలు ఖరారు చేసారు. దీనికి ముందు గత 25 రోజులుగా సీనియర్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి చాలా సమాచారం తెలుసుకో గలిగారు.కార్యాచరణ ప్రణాళిక
ఈ ప్రణాళిక ఖరారు చేసేందుకు రాష్ట్రం మొత్తానికి వర్తించే విధంగాకాక, ఏ ప్రాంతానికి సరిపోయేవిధంగా ఆ ప్రాంతంలో ప్రణాళికలు రచించారు. అంటే జిహెచ్ ఎంసికి ఒక విధంగా గ్రామీణ ప్రాంతాలకు మరో విధంగా ఉంటాయి.ప్రారంభం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టర్ డా.అకున్ సభర్వాల్ సంగారెడ్డిలో శనివారం ఈ ప్రణాళికను ప్రారంభించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలనుంచి అధికారులందరూ హాజరయ్యారు.
లక్షిత అక్రమాలుపట్టణ ప్రాంతాలు :  ప్రజా వినియోగం, ఏ4,  2బీ ఉల్లంఘనలుగ్రామీణ ప్రాంతాలు :  ఐడి నియంత్రణ, కల్తీకల్లు పై నిఘా,  గరిష్ఠ చిల్లర ధర తదితర నియమాల ఉల్లంఘనలు
అవార్డులు : కార్యాచరణ ప్రణాళికలను 25 రోజుల చొప్పున నాలుగు భాగాలుగా విభజించారు.
1. ఐడి నియంత్రణ, 2. కల్తీ కల్లు, 3. ఎ4, 2బి సందర్శనలు, 4. ఎం.ఆర్.పి ఉల్లంఘనలు, 5. ప్రజావినియోగం
నాలుగు భాగాల్లో ప్రతిభాగానికి ప్రతిడివిజన్ నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచే 5మందికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.ముగింపుఈ వందరోజుల కార్యాచరణ ప్రణాళిక నవంబరు, 19వ తేదీతో ముగుస్తుంది. ఆ సందర్భంగా 100 రోజులలో సాధించిన ఫలితాలు, వాటిపై సమీక్షకూడా జరుపుతారు.
Tags:Excise Department is 100 days live functional

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *