Excise police raid on illegal marauder

అక్రమ సారాతయారీపై ఎక్సెజ్‌ పోలీసులు దాడులు

– కేసులు నమోదు

Date:12/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

అక్రమ సారా తయారీ, విక్రయ కేంద్రాలపై ఎక్సెజ్‌ పోలీసులు , సీవిల్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మండలంలోని నల్లగుట్లపల్లెతాండలో తయారీదారుల ఇండ్లలో ఎక్సెజ్‌ టాక్స్ఫోర్స్ సిబ్బంది, ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ గంగిరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీనివాసులునాయక్‌ అనే వ్యక్తి సారా తయారీకి కావాల్సిన వస్తువులను ఉంచుకుని ఉండగా అతనిని పట్టుకున్నారు. అలాగే 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వీటితో పాటు జెడి తాండా రహదారి మార్గంలో నాటుసారా విక్రయిస్తున్న లక్ష్మీదేవి అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సెజ్‌ సీఐ మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేయడం, విక్రయించడం నేరమన్నారు. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా తాండాలలో కొంత మంది రహస్యంగా తయారు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, ఎక్సెజ్‌ ఎస్‌ఐ సరితారెడ్డి, కానిస్టేబుళ్ళు కిషోర్‌, నాగరాజు, వల్లి, చౌడమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆంగ్లబాష బోదనపై ఉపాధ్యాయులకు శిక్షణ

Tags: Excise police raid on illegal marauder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *