ఉద్వేగ్..మాయం

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీకి రూ. మూడువందల కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆస్పత్రి కట్టిస్తామని గతంలో ఎంవోయూ చేసుకున్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రా కంపెనీ చప్పుడు చేయడం లేదు. ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను రూ. కోటి.. కోటిన్నరకు అమ్మి చిన్నపిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామని ఇప్పుడు టీటీడీ చెబుతోంది. అసలు ఓ సేవ టిక్కెట్లను అంత పెద్ద మొత్తానికి అమ్మడమే విచిత్రం అనుకుంటే.. ఆ సేవ టిక్కెట్లను పాలక మండలి సభ్యులే అత్యధికంగా కొనుగోలు చేస్తూండటం మరింత వివాదంగా మారింది. ఈ తరుణంలో అసలు పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామని వచ్చిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రా ఏమయిందన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఉద్వేగ్ ఇన్‌ఫ్రా పేరుతో ఓ కంపెనీ యజమానికి తిరుమలకు వచ్చి రూ. మూడు వందల కోట్లతో చిన్న పిల్లల ఆస్పత్రి కట్టేస్తానని.. అది మొత్తం విరాళమేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఎంవోయూ కూడా చేసుకున్నారు. మామూలుగా విరాళం అయితే…చెక్ తీసుకోవాలి.. లేకపోతే ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి..కానీ ఇక్కడ ఉద్వేగ్‌ యజమానితో టీటీడీ యాజమాన్యం ఎంవోయూ చేసుకుంది. తర్వాత ఆ ఉద్వేగ్ కంపెనీ సూట్ కేసు కంపెనీ అని తేలింది. వ్యాపారాలు.. కార్యాకలాపాలు ఏమీ లేవని.. ఆ కంపెనీ ఖాతాలో రూ. మూడు వందలు కూడా లేవని వెల్లడయింది. అప్పుడే .. ఆ సూట్ కేస్ కంపెనీలో కొంతమంది తెలుగువాళ్లు డైరక్టర్లుగా ఎంవోయూ చేసుకోవడానికి వారం ముందే చేరారని కూడా స్పష్టమయింది. ఇప్పుడా ఉద్వేగ్ కంపెనీ ఏమయింది ? వెనక్కి వెళ్లిపోయిందా.. టీటీడీనే ఎంవోయూ రద్దు చేసుకుందా ? విరాళం ఎందుకు నిలిపివేశారు..? ఇలాంటి వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

Tags:Excitement..eat

Post Midle
Post Midle
Natyam ad