ఎగ్జిట్‌పోల్స్పై వైఎస్సార్సీపి శ్రేణుల్లో ఉత్సాహం

Exciting in YSRCP lines on the Exit Poles

Exciting in YSRCP lines on the Exit Poles

– అధికారం తమదేనంటు ధీమా

 

Date:19/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్ను ఆదివారం రాత్రి ప్రకటించారు. అన్ని సర్వేలలోను వైఎస్సార్సీపి ప్రభంజనం అంటు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. ప్రతి ఒక్కరు టీవిల ముందు కుర్చుని సర్వే ఫలితాలపై ఎవరికి వారు సమీక్షలు ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాలను కూడగట్టుకోవడంలో పెద్దిరెడ్డి విజయం సాధించారు. పెద్దిరెడ్డి ప్రచారాలకు ప్రత్యర్థిపార్టీలు దరిచేరకుండపోయాయి. పెద్దిరెడ్డి చారిష్మా ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజలను కూడగట్టుకోవడంతో విఫలమైయ్యారు. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి.

130 స్థానాలు వస్తాయ్‌….

రాష్ట్రంలో వైఎస్సార్సీపికి ప్రజలు పట్టం కడతారని, 130 స్థానాలు గెలుచుకుని వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆరు నెలల నుంచి చెబుతున్నారు. ప్రజలు ఎన్నికలకు ముందే చంద్రబాబును గద్దె దింపాలని నిశ్చయించారు. మేము ఊహించని ఫలితాలే నేడు ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించాయి.

– కొండవీటి నాగభూషణ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ , పుంగనూరు .

జగన్‌ కష్టానికి ఫలితం…

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో పాటు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు , పాదయాత్ర , దీక్షలతో పడిన కష్టాలను గుర్తించి, ప్రజలు ఫలితం ఇచ్చారు. ఎగ్జిట్‌పోల్స్లో వైఎస్సార్సీపి ప్రభంజనం అని ప్రకటించడం హర్షనీయం. ఈ విజయం రాష్ట్ర ప్రజలది.

 


– అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి , పుంగనూరు .

ఊహించినదే….

రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టం కడుతారని, పాదయాత్రల్లోనే బహిర్గతమైంది. అధికార తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్సీపి , ఊహించినట్లుగా ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో అధికార పీఠాన్ని అప్పగిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల విజయం.

 

– పి.అయూబ్‌ఖాన్‌, వ్యాపారి, పుంగనూరు.

నవరత్నాలతోనే ……

వైఎస్సార్సీపి ఎన్నికల ప్రచారం పూర్తిగా నవరత్నాలతోనే జరిగింది. రాష్ట్ర ప్రజలకు నవరత్నాలతో ఎంతటి లబ్ధిచేకూరుతుందో ప్రజలు అంచనాలు తయారు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్దమైయ్యారు. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఇందుకు నిదర్శనం.

 

– కిజర్‌ఖాన్‌, మైనార్టీ నాయకుడు, పుంగనూరు.

 

నవరత్నాలకు పట్టం…..

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. నవరత్నాలతో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ప్రజలు నవరత్నాలను స్వాగతించి, పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వైఎస్సార్సీపికి ఓట్లు వేశారు. ఈ విషయం ఎగ్జిట్‌పోల్స్లో వెల్లడికావడం శుభపరిణామం.

 

– తులసెమ్మ, మహిళా నాయకురాలు, పుంగనూరు.

డ్వాక్రా రుణాల రద్దును స్వాగతించారు….

ఎన్నికల తేదీ నాటికి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని వైఎస్సార్సీపి ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రజలు నమ్మకంతో స్వాగతించారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నిశ్చయించుకుని, నిశబ్ధ విప్లవంగా వైఎస్సార్సీపికి ఓట్ల వర్షం కురిపించారు. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలలో ఫలితాలు ప్రజల తీర్పు.

– పి.రహత్‌జాన్‌, గృహిణి, పుంగనూరు.

వైఎస్సార్సీపి విజయం ఊహించాం….

రాష్ట్రంలో వైఎస్సార్సీపి ప్రభంజనం సృష్టిస్తోందని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ప్రకటించడం హర్షనీయం. ఈ విజయాలను ఊహించాం. రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుంది. ముఖ్యంగా మహిళలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలు మహిళల్లో నమ్మకాన్ని పెంపొందించింది.

– రషీద , గృహిణి, పుంగనూరు.

ప్రజల తీర్పే ఎగ్జిట్‌ పోల్‌….

రాష్ట్రంలో వైఎస్సార్సీపి ప్రభంజనం సృష్టిస్తోందని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ప్రకటించాయి. ప్రజల తీర్పును స్వాగతించాలి. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జనప్రవాహంలా మారి, ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్సీపి సువర్ణ అద్యాయం ప్రారంభంకానున్నది. ఇది ప్రజల నిశ్శబ్ధ విప్లవం.

– చందారెడ్డెప్పరెడ్డి, రైతు, పుంగనూరు.

వైఎస్సార్సీపికి అన్ని వర్గాల చేయూత….

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపికి చేయూతనిచ్చారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న కృతనిశ్చయంతో ఓట్లు వేశారనడానికి నిదర్శనం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు. నూతన వైఎస్సార్సీపి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు.

– నూర్‌అహమ్మద్‌, డ్రైవర్‌, పుంగనూరు.

తండ్రిబాటలో తనయుడు ….

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యమౌతుందని ప్రజలు నమ్మారు. ఎవరు ఊహించని రీతిలో ఓట్లు వేసి, వైఎస్సార్సీపి ప్రభంజనానికి తెరతీశారు. ఈ విజయం పేద ప్రజలందరిది.

– ఎం.సుమలత. గృహిణి, పుంగనూరు.

 

ముస్లింలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇఫ్తార్‌ విందు

Tags: Exciting in YSRCP lines on the Exit Poles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *