లోయలో పడిన విహారయాత్ర బస్సు

Date:04/01/2020

అనంతపురం ముచ్చట్లు:

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉడిపి సమీపంలోని కార్వార్ దగ్గర అనంతపురం జిల్లా కదిరి నుంచి వెళ్లిన బస్సు లోయలో పడింది.. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. 35మందికి గాయాలయ్యాయి. ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుడు పదవ తరగతి విద్యార్థి బాబా ఫకృద్దీన్‌‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల్లో 45మంది విద్యార్థులు, 11మంది టీచర్లు ఉన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బస్సు అద్దాలు పగులుగొట్టి కొందరు విద్యార్థులను బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారు ఉడిపి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కదిరి నుంచి గురువారం విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆరా తీశారు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.మరోవైపు బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడినవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు త్వరలో అందుబాటులోకి మందు

 

Tags:Excursion bus in the valley

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *