భర్త ఇంటి ముందు బైటాయింపు

Date:20/10/2020

వేములవాడ ముచ్చట్లు

ప్రేమించి నీవు లేంది నేను లేను నీవే నా జీవితం అంటూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని మోజు తీరకా ఇప్పుడు వద్దంటున్నాడు. కొనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన అజయ్ సిరిసిల్లా మండల పెద్దూర్ గ్రామానికి చెందిన రాణిని మూడు సంవత్సరాల క్రితం సిరిసిల్లా కాలేజి చదువుతున్నపుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసికున్న అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుండగా వాటిని చెడగొట్టించి గత రెండు నెలల క్రితం ఒక్క హనుమాను ఆలయం ముందు పెళ్లి చేసుకున్నారు.
ఎర్ర గొల్ల కులంకు చెందిన అబ్బాయి, మంగలి కులానికి చెందిన అమ్మాయి కావడం తో  నిత్యం కులం పేరుతో అత్త మామలు వేధించడం చేస్తున్నారు. నెల రోజులు బాగానే చుసుకున్న ప్రియుడు తల్లిదండ్రుల పక్షాన చేరి వరకట్నం తెమ్మని, నీది చిన్న కులము అంటూ తిడుతూ చితక బాది బయటకు గెంటేశాడంటూ రోదిస్తూ కంటి తడిపెట్టింది. ప్రియుని ఇంటి ముందు బైఠాయించిన అమ్మాయికి మద్దతుగా గ్రామస్థులు, మహిళ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు, తల్లి దండ్రులు ఇంటికి తాళం వేసి పరారు అయ్యారు.  న్యాయం కావాలంటూ ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.  అమ్మాయి కి న్యాయం జరిగేదాక ఊరుకోమని, ఇంటి ముందు ధర్నా చేపడుతూనే ఉంటామని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

తక్షణ సహాయం అందిస్తున్నాం

 

Tags:Exemption in front of husband’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *