పుంగనూరులో కరోనాను కట్టడి చేసేందుకు స్వీయనియంత్రణ పాటించండి – జడ్జి బాబునాయక్‌

Date:23/02/2021

పుంగనూరు ముచ్చట్లు:

కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించి, అధికారులకు సహకరించాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా తీవ్రమౌతున్న తరుణంలో ప్రజలు తమకుతాముగా నియంత్రణ చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా మాస్క్లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. అలాగే కరోనా సోకిన వారిని చులకనగా చూడటం, కరోనా సోకి మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం చట్టరీత్య నేరమన్నారు. ఇలాంటి వాటిపై మండల్‌లీగల్‌ సర్వీసస్‌ అథారిటికి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ప్రభలకుండ ఉండేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Exercise self-restraint to bind the corona in Punganur – Judge Babunayak‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *