Natyam ad

ఓటుహక్కును సద్వినియోగం చేసుకోండి

పుంగనూరు ముచ్చట్లు:

ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేసుకుంటే ప్రమాదం ఊహించలేమని అబ్ధుల్‌కలామ్‌ ట్రస్ట్ ఫౌండర్‌ అయూబ్‌ఖాన్‌ తెలిపారు. శుక్రవారం ఎంసీవి డిగ్రీ కళాశాలలో ఓటుహక్కుపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు ఓట్ల కోసం తాయిలాలు ఇస్తారన్నారు. కానీ ప్రజలకు , సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకు మాత్రమే ఓటు వేసి దాని విలువను, రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, సభ్యులు నాగరాజు, భద్రయ్య, శ్రీనివాస్‌, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Exercise your right to vote

Post Midle