వరి ప్రత్యామ్నాయంపై కసరత్తులు

అదిలాబాద్ ముచ్చట్లు:

వరి వేయవద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా పత్తి సాగు విస్తీర్ణం పెంచేలా కసరత్తులు చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ లో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచనలిచ్చింది. అయితే చాలా జిల్లాల్లో భూములు పత్తి సాగుకు అనుకూలంగా లేవు. ఉత్పత్తి వ్యయానికి, మద్దతు ధరకు ఎంతో తేడా ఉంది. ఈ నేపథ్యంలో నష్టాలు వస్తే ఎవరు భరిస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటి 47 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో కోటి 27 లక్షల ఎకరాలే సాగవుతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 నుంచి 30 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగయ్యేది. అయితే తెలంగాణ వచ్చాక ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. పత్తికి ప్రత్యామ్నాయం లేకపోవడం, వర్షపాతం ఆశాజనకంగా ఉంటుండడంతో రెండు, మూడేండ్ల నుంచి తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం 55 లక్షల ఎకరాలకు పెరిగింది. దీన్ని ఇప్పుడు 70 నుంచి 75 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.పత్తి సాగులో ఎరువులు అధికంగా వాడాల్సి ఉండటం వల్ల భూములు నిర్జీవమయ్యే ప్రమాదముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీఏసీపీ నివేదిక ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో ఒక హెక్టారుకు సుమారు 1140 కిలోల ఎరువులు వాడుతున్నారు. అంతేకాకుండా ఎరువుల వాడకం అధికం కావడంతో పాటు నీటి వినియోగమూ పెరిగే ప్రమాదముంది. తద్వారా నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు, ఉత్పత్తి వ్యయం మరింత పెరగవచ్చు.
25 నుంచి 30 లక్షల ఎకరాలే అనుకూలం

 

 

Post Midle

ప్రస్తుతం పత్తి సాగు విస్తీర్ణం 55 లక్షల ఎకరాలైనా.. పూర్తిస్థాయిలో సాగుకు అనుకూల యోగ్యమైన భూమి 25 నుంచి 30 లక్షల ఎకరాలే. పత్తి సాగుకు నల్లరేగడి భూములు అవసరం. దీంతో పాటు 750 నుంచి 900 మి.మీ వర్షపాతం ఉంటే పత్తిలో ఆశించిన దిగుబడులు వస్తాయి. విత్తనం నాటే దగ్గర మీటర్ లోతు తవ్వినా మట్టి ఉండాలి. కానీ మన దగ్గర లోతు తక్కువ భూములుండడంతో మొక్క వేర్లు లోపలకి వేనుకోవు. దీంతో మొక్క ఆశించిన మేర ఎదగదు. దిగుబడిపై ప్రభావం పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా 70 నుంచి 75 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాలని భావిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే అన్నదాతలు తీవ్రమైన నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, 2018లో నాబార్డ్ నీరు ఎక్కువ అవసరమైన పంటలపై చేసిన సర్వే ప్రకారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పత్తి సాగు అంత మంచిది కాదని సూచించింది. కానీ వీటిని పట్టించుకోని ప్రభుత్వం పత్తి సాగును పెంచేందుకే మొగ్గు చూపుతోంది.ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక్క రూపాయి చెల్లించడం లేదు. చైనా, అమెరికా లాంటి దేశాల్లో లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ, వాటి సాగుకు అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, నష్టమేర్పడినపుడు చెల్లిస్తున్న పరిహారాల గురించి మాత్రం చెప్పడం లేదు. అమెరికాలో పంట నష్టపోతే మొత్తం క్రాప్ డ్యామేజీ లేదా పంట దిగుబడిని లెక్కించి రెండు రకాలుగా పరిహారాన్ని చెల్లిస్తారు. కానీ మనదగ్గర ప్రస్తుతం పంట పూర్తిగా నష్టపోయినా పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు.సీఏసీపీ 2022 గణాంకాల ప్రకారం.. క్వింటాలు పత్తి ఉత్పత్తి ఖర్చు రూ.10,593. కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ. 6,080 మాత్రమే. అంటే ఒక్కో క్వింటాకు సుమారు రూ.4వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సీఏసీపి 2022 ప్రకారం 5.26 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. దేశవ్యాప్తంగా పత్తి 330 లక్షల బేళ్లు (ఒక బేలుకు 170 కేజీలు) ఉత్పత్తవుతుండగా, ఇందులో సుమారు 250 నుంచి 280 లక్షల బేళ్లు వినియోగానికి అవసరం పడుతున్నాయి. అంటే 50 నుంచి 80లక్షల బేళ్లు నిలువ ఉంటున్నాయి. ఒకవేళ దిగుమతులు పెరిగి, నిల్వలు మరింత పెరిగితే కొత్తగా వచ్చే పత్తికి ధరలు పడిపోయే ప్రమాదమూ లేకపోలేదు.

 

బాధ్యత లేకపోవడంతోనేనా..?
పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంతగా లేకపోవడంతోనే సాగు విస్తీర్ణం పెంచాలని భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పత్తిని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐతో పాటు వ్యాపారులు అధికంగా కొనుగోలు చేస్తారు. వరి లాగా కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉండదు. దీంతోనే పత్తి సాగు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలువరు చర్చించుకుంటున్నారుపత్తి అధిక సాంద్రత సాగుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం చెబుతున్నా అందుకు మన భూములు సారవంతంగా లేవని రైతు స్వరాజ్య వేదిక చెబుతోంది. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న బీటీ హైబ్రిడ్ విత్తనాలు అధిక సాంద్రత సాగుకు సరిపోవు. ఈ పద్ధతిలో సాగు చేయాలంటే విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇదే సాగు విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2018లో నాగ్‌పూర్‌లోని సీఐసీఆర్ ‘సూరజ్’ అనే విత్తనాన్ని రూపొందించింది. కానీ అవి ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు.
పత్తి సాగు ఎక్కువ అవకాశాలున్న జిల్లాలు
ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఉమ్మడి ఖమ్మం, జనగామలో కొంత భారం
తక్కువ అవకాశాలున్న జిల్లాలు
జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్
నామమాత్రపు అవకాశాలున్న జిల్లాలు
నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్ లో కొంత భాగం
సాగుకు యోగ్యం కాని జిల్లాలు
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, సూర్యపేట

 

Tags: Exercises on rice substitution

Post Midle
Natyam ad