బరితెగించిన ఇసుక మాఫియా

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మేడూరు గ్రామపంచాయతీ పరిధిలోని జువ్వలపాలెం చెరువులో బుధవారం రాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా మట్టి అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఈ  సమాచారాన్ని అందుకున్నఅధికారులు  అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఈ నేపధ్యంలో అధికారులపై భౌతిక దాడులకు మట్టి మాఫియా  తెగబడింది.  అడ్డుకున్న పోలీసులపై కుడా దాడులు జరగడంతో ఒక పోలీసుకు తలపై గాయాలయ్యాయి.  రెవిన్యూ ఇన్స్పెక్టర్  కె. శ్రీనివాస్ ఫిర్యాదుతో పొలీసులు కేసు నమోదు చేసారు. దాడిలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ముదునూరి. బాలకృష్ణ ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 12 గంటల సమయంలో దాడి జరిగితే ఉదయం ఐదు గంటల వరకు  సర్కిల్ ఇన్స్పెక్టర్ ముక్తేశ్వరరావు స్పందించలేదని సమాచారం.  పమిడిముక్కల పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసారు.

 

Tags: Exhausted sand mafia

Post Midle
Post Midle
Natyam ad