కర్నాటక మంత్రి వర్గం విస్తరణ.. ఏడుగురికి అవకాశం

Date:13/01/2021

బెంగళూరు  ముచ్చట్లు:

కర్నాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప మంత్రి వర్గంలో ఏడుగురికి అవకాశం కల్పించారు. ఈ మేరకు మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో ఎంటీబీ నాగరాజ్, ఉమేశ్‌ కట్టి, అరవింద్ లింబవాలి, మురుగేశ్‌ నిరాని, ఆర్ శంకర్, పీపీ యోగేశ్వర, అంగారా ఉన్నారు. కొత్త మంత్రులంతా బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు  ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 27 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఏడు మంత్రుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యడ్యూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి. ఆగస్టు 2019లో 17 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయగా.. ఫిబ్రవరి, 2020లో మరో పది మందికి అవకాశం కల్పించారు. బుధవారం మరో ఏడుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Expansion of Karnataka cabinet .. Opportunity for seven

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *