ఆరోగ్య కిట్స్ కోసం ఎదురుచూపులు

Expectations for health kits

Expectations for health kits

Date:31/12/2018
జగిత్యాల ముచ్చట్లు:
పాఠశాలల్లో బాలికల గైర్హాజరీ తగ్గించేందుకు ఆరోగ్య కిట్స్ అందిస్తోంది ప్రభుత్వం. విద్యార్ధినులకు 13 రకాల వస్తువులను సంవత్సరంలో నాలుగు సార్లు అందించాలని నిర్ణయించింది. సమగ్ర శిక్షా ద్వారా ఈ కిట్స్ పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టింది. సర్కార్ నిర్ణయం బాగానే ఉన్నా అమలుకు మాత్రం అవాంతరాలు ఏర్పడుతున్నాయన్న కామెంట్స్ జగిత్యాల జిల్లాలో వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో పంపిణీ చేయాల్సిన ఈ కిట్స్ ఇప్పటికీ అందలేదని పలువురు విద్యార్ధినులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి నెలసరి సమయంలో విద్యార్ధినులు పాఠశాలలకు గైర్హాజవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం హెల్త్ కిట్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాక పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతకూ ప్రాధాన్యతనిచ్చేలా 13 రకాల వస్తువులు అందిస్తోంది. ఈ కిట్స్ పంపిణీతో బాలికల హాజరు శాతం ప్రభావితం కాదని పిల్లలు చదువుకు దూరం కారని ప్రభుత్వం భావించింది.
అయితే కిట్స్ పంపిణీకి బ్రేక్ పడిన పరిస్థితి నెలకొనడంతో విద్యార్ధినులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కిట్స్ సజావుగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి విద్యా సంవత్సరంలో మూడు నెలలకోసారి నాలుగు సార్లు పరిశుభ్రత కిట్లను పంపిణీ చేస్తారు. కానీ ఈ దఫా ఈ కార్యక్రమం ఆలస్యమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమై కార్యరూపం దాల్చే వరకు ఆగస్టు వచ్చింది. వీటిపై ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు అంటించారు. కానీ పంపిణీలో జాప్యం జరిగి సెప్టెంబరులో అందించారు.
అప్పటికే రెండో కిట్‌ అందాల్సి ఉంది. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటివరకు కిట్స్ ను అందించే చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కిట్స్ కోసం దాదాపు 19503 మంది బాలికల ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు, డిసెంబరు రెండు పర్యాయాలకు సంబంధించిన కిట్లు ప్రస్తుతం అందించాల్సి ఉందని సమాచారం. విద్యార్ధినులకు అందించే కిట్స్ లో శానిటరీ నాప్‌కిన్స్ తో పాటు సౌందర్య సామగ్రి ఉంటాయి. మొదటి విడతలోనూ సరిపడినన్ని కిట్లు రాలేదు. రానివారికి పంపిణీ చేస్తామని అధికారులు తేల్చి చెప్పారు. అయితే అవి ఇంతవరకు రాలేదు. మరో రెండుసార్లు ఇవ్వాల్సిన కిట్స్ కూడా అందలేదు. ఏదేమైనా అధికారులు స్పందించి విద్యార్ధినులకు సత్వరమే హెల్త్ కిట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags:Expectations for health kits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed