సంక్షేమాన్ని వివరిస్తూ…. సమస్యలు వింటూ- గడపగడపకు మనప్రభుత్వంలో రాష్ట్ర కార్యదర్శి దామోదరరాజు

–ప్రతి కుటుంభానికి సంక్షేమ లబ్ది

చౌడేపల్లె ముచ్చట్లు:


వై ఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ది అందుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీసీ సభ్యుడు ఎన్‌. దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు తెలిపారు. బుధవారం మండలంలోని లద్దిగం, జోగిండ్లు, అమర కృష్ణాపురం గ్రామంలోని ప్రతి గడప గడపకూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పర్యటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో లబ్దిపొందిన వివరాలను వివరించారు. ఒకొక్క కుటుంబం ఎంత లబ్దిపొందారో వివరిస్తూ ముద్రించిన బావుటాలను అందజేశారు. ఓటిసీ దృవీకరణ పత్రాలను అందజేశారు.మూడేళ్ళలో 95 శాతం హామీలను అమలు పరిచిన ఏకైక సీఎం జగనన్నేనని అన్నారు.మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో మండలాన్ని అభివృద్దిచేశారని, వారితోపాటు ప్రభుత్వానికి అండగా మనమందరం ఉండాలని కోరారు. సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత సహాయకుడు మునితుకారం, వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి మాజీ ఎంపీపీలు రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ,అంజిబాబు, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి,సర్పంచ్‌ కృష్ణారెడ్డి,ఎంపీటీసీ జ్యోతమ్మ,పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌ కళ్యాణ్‌,కోఆప్షన్‌మెంబరు స్యాధిక్‌ బాషా,పీఏసీఎస్‌ డైరక్టర్‌ రమేష్‌బాబు,మాజీ బోయకొండడైరక్టర్‌ నాగరాజ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Explaining Sanhokshema….Listening to problems- Damodararaju, State Secretary in our government.

Leave A Reply

Your email address will not be published.