ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం పై వివరణలు.  

జగిత్యాల ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ ఆడ్వాన్స్ మెంట్ స్కీం వర్తింపజేస్తూ జీవో నెంబర్.65 ద్వారా గురువారం ఉత్తర్వులు జారీచేసిందని టీ ఉద్యోగుల జేఏసి జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,టీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, టీ ఉద్యోగుల జేఏసి  జిల్లా ఛైర్మన్ భోగ  శశిధర్, కో చైర్మన్, టీ రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ ఉద్యోగుల సమాచారార్థం ఆ జీవో పై వివరణలు తెలిపారు. శుక్రవారం జిల్లా టీఎన్జీవో భవన్లో వారు మాట్లాడారు.జూన్ నెల వేతనాలతో పాటే ఇది కూడా అమల్లోకి వస్తుందన్నారు.ప్రభుత్వ,స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బోధన,బోధనేతర సిబ్బంది అందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.అయితే ఆయా శాఖల్లో ఖాళీలు లేక పదోన్నతులు లభించక దీర్ఘకాలంగా  ఒకే కేడర్లో పనిచేస్తున్న  ఉద్యోగుల కోసం ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం ను అమల్లోకి ప్రభుత్వం తెచ్చిందని,1982 నుంచి ఇది కొనసాగుతోందని,పదోన్నతి లభించక ఒక ఉద్యోగి ఒకే పోస్టులో కొనసాగుతూ ఉంటే   ఆ ఉద్యోగికి ఆతర్వాత కేడర్ పోస్ట్ స్కెల్ ను వర్తింప జేయడమే  దీని ఉద్దేశ్యమన్నారు.

 

 

 

 

ఇలా ఒకే  పోస్టులో 6,12,18,24 ఏళ్లపాటు కొనసాగుతూ ఉంటే ఆయా కాలానికి అనుగుణంగా స్కెల్లు వర్తిస్తాయి.ఉదాహరణకు ఒక జూనియర్ అసిస్టెంట్ కు పదోన్నతి లభించలేదని అనుకుందాం.అదే పోస్టులో ఆరేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటే  సీనియర్ అసిస్టెంట్ వేతనం వర్తిస్తుంది.12 ఏళ్లుగా అదే పోస్టులో ఉంటే సూపేరెండేంట్ స్కెల్ వర్తిస్తుంది. తెలంగాణ వచ్చిన తరువాత  ఏర్పాటయిన మొట్టమొదటి పీఆర్సీ కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఆ మేరకు ఆ సిఫార్సులనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక కేడర్లో 6,12 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి స్పెషల్ ప్రమోషన్ పోస్ట్(ఎస్ పి పి-1ఏ,ఎస్ పిపి -1బి స్కెల్లు,18 ఏళ్లు పూర్తయిన వారికి ఎస్ ఏ పిపి-1బి స్కెల్లు,24 ఏళ్ళు సర్వీస్ ఉన్నవారికి పిపి-2 స్కెల్లు వర్తిస్తాయని ఉట్ఠసర్వుల్లో పేర్కొన్నారు.2018 జులై1 నుంచి అమల్లోకి వచ్చిన పీఆర్సీ వేతనాలతో పాటే ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమల్లోకి వచ్చినదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2018 జులై 1 నుంచి2020 మార్చి31 వరకు నోషనల్ బెనిఫిట్ ,2020 ఎప్రిల్ 1 నుంచి2021 మార్చి 31 వరకు బకాయిలు చెల్లింపు, ఈ జూన్ నుంచి నగదు చెల్లింపు లాగే ఈ స్కీం వర్తిస్తుందని వారు వివరణాత్మకంగా  వివరించారు.ఈసమావేశంలో టీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి గూడ ప్రభాకర్ రెడ్డి,కోశాధికారి నూగురి సుధీర్ కుమార్,రెవెన్యూ కార్యదర్శి చెలుకల కృష్ణ,  నాయకులు నాగేందర్ రెడ్డి,రవీందర్, సత్యనారాయణ, షాహిద్ బాబా,గడ్డం శశిధర్, మహమూద్, ముదాం రవి, సంధ్య, ఇంద్రజ, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Explanations on Automatic Advancement Scheme for Employees.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *