ఆటో వాలాల దోపిడీ

Date:18/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు

లాక్‌డౌన్‌ సడలింపులతో రోడ్డెక్కిన ఆటో, క్యాబ్‌లు అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. సాధారణ రోజుల్లోనే ఇష్టారాజ్యంగా వసూలు చేసే ఆటోవాలాలు కరోనా కాలాన్ని మరింత క్యాష్‌ చేసుకుంటున్నారు. నగరంలో బస్సులు నడవకపోవడంతో ఇదే అదునుగా తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తమ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ప్రజల రాకపోకలు గణనీయంగా పెరిగింది. దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో వచ్చే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్ ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదునుగా హైదరాబాద్‌ నగరంలో ఆటో వాలాల దోపిడీ యథేశ్చగా కొనసాగుతోంది. ఆత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే సుమారు 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్పత్రులను వెళాల్సి వస్తే 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ సమయంలో ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి సికింద్రాబాద్‌ వరకు గతంలో 150 తీసుకుంటే ప్రస్తుతం 500 తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.  మూసీ నదిలో కనిపించిన మొసలి ‎ఆటో వాలలు అధిక డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రతి రోజు తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక సెవెన్‌ సీటర్‌ ఆటోలు సైతం ఇదే విధంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో సగం సంపాదన చార్జీలకే అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యాబ్‌లు కూడా ఇలాగే వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ‎మొత్తంగా కరోనాతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఆటోల చార్జీలతో మరింత ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికలు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిబంధనలకు అనుగునంగా ఆర్టీసీ బస్సులు నడపాలని కోరున్నారు.

 

 శాఖల మధ్య సమన్వయలోపంతో రైతుల‌కు శాపం

Tags:Exploitation of auto ramps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *