దోపిడీకి గురవుతున్న వినియోగదారులు

దోపిడీకి గురవుతున్న వినియోగదారులు

హైదరాబాద్ ముచ్చట్లు:

నేటి సమాజంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా పదిసార్లు ఆలోచించక తప్పదు.  అయినా వినియోగదారులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు.  ఇట్టి దోపిడీని అరికట్టి వినియోగదారునికి ఉన్న హక్కులను నిర్ధారించి , వాటి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1986లో వినియోగదారుల రక్షణ చట్టనికి రూపకల్ప చేశారని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి తెలిపారు.  ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ వినియోగదారులకు ఉన్న హక్కులను తెలియజేస్తూ , అట్టి హక్కులు వినియోగదారునికి లభించకపోయినట్లయితే వాటిని చట్ట ప్రకారము ఎలా సంక్రమించుకోవాలో,  నష్టపోయిన వారికి పరిహారం ఎలా సాధించుకోవాలో,  ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలో ఈ చట్టంలో రూపొందించారని,  ఖర్చు లేకుండా వినియోగదారునికి ఉపసమనం కలిగించడం ఈ చట్ట ఉద్దేశం అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి అన్నారు.
చట్టంలో లోని అంశాలు: వినియోగదారునికి వర్తించే పదాలకు అర్థాలను చట్టంలో పొందుపరిచిన అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సేవ: వినియోగదారునికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు అందించడం. వినియోగదారుడు తన కావలసిన సేవకు మూల్యం చెల్లించినట్లయితే అతను అవతలి వ్యక్తి నుంచి లేక  సంస్థ నుంచి తనకు సరైన లోపం లేని సేవను పొందే హక్కు ఉంది.  మీ సేవలు బ్యాంకింగ్ లో కావచ్చు. జీవిత బీమా, రుణాలు, అభివృద్ధి ప్రక్రియ, విద్యుత్ శక్తి సరఫరా లేక ఇంధన శక్తి సరఫరా, ఆహారము, వసతి, ఇళ్ల నిర్మాణము, వినోదము, వార్తలు లేక ఇతర సమాచారాన్ని అందజేయడం వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.  అయితే వ్యక్తిగత ఒప్పందం ప్రకారం అయితే లేదా ఉచితంగా అందించినట్లయితే ఈ చట్టం పరిధిలోకి రావు అని  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి పేర్కొన్నారు.
సేవలోపము:  ఒప్పంద ప్రకారము సేవ చేయకపోవడం,  అసంపూర్తి సేవ,  నాణ్యత లోపము, సేవ చేసే పద్ధతిలో లోపము,  తప్పుగా చేయటము,  చట్టప్రకారం లేక విధుల ప్రకారము చేయకపోవడం,  పని లోప భూయిష్టంగా ఉండటం,  నాసిరకంగా ఉండటం వంటివి చట్టం పరిధిలోకి వస్తాయని న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు సాయి చౌదరి అన్నారు.
సరుకు (వస్తువు) లోపం:  కొన్న వస్తువు ఉండాల్సిన నాణ్యత, పరిమాణము,  శక్తి లేకపోవుట,  ఆ వస్తువులో ఏమైనా తప్పు కలిగే రీతిగాని,  చట్టప్రకారం ఉండాల్సిన మోతాదులో లేకపోవడం కాని,  వ్యాపారస్తుల హామీ ఇచ్చినట్లు లేదా ప్రకటించినట్లుగా లేకపోవడం వంటి చట్టపరధిలోకి వస్తాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి తెలిపారు.
 

వ్యాపారస్తుడు అనగా:  వస్తువు (సరుకు)లను అమ్మే వ్యక్తి (సంస్థ) అమ్మకానికి ఇతరులకు వస్తువులను అందించే వ్యక్తి (సంస్థ),  సరుకు (వస్తువు)లను ఉత్పత్తి చేయువాడు,  తయారైన వస్తువులను ప్యాకెట్లలో ఉంచి అమ్మడం లేదా పంచడం చేసినప్పుడు అట్టి ప్యాకింగ్ చేసిన వ్యక్తి కూడా ఈ చట్టం ప్రకారము వ్యాపారస్తుడు అనబడతాడని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి తెలిపారు.
.       అక్రమ వ్యాపార పద్ధతి:  వ్యాపారాభివృద్ధి (అమ్మకాలు) పెంచుకోవడం కోసం సరుకుల రవాణా సరఫరా చేయటం కోసం,  సేవలు అందించడం కోసం అనుసరించే తప్పుడు పద్ధతి అని అంటారని సాయి చౌదరి తెలిపారు.
అక్రమ వ్యాపార పద్ధతి పనులు, సందర్భాలు: 1.నోటి మాటల ద్వారా గాని,  ప్రకటనల ద్వారా గాని,  రాతపూర్వకంగా గాని,  కనిపించే గుర్తులు ద్వారా గాని. A. అమ్మచూపుతున్న లేక సేవ అందిస్తున్న,  ఒక ప్రత్యేకమైన ప్రమాణము, నాణ్యత, తరగతి, మిశ్రమము పద్ధతి,  పోలిక లేకపోయినా ఉన్నట్లు చెప్పడం. B. పాత వస్తువులను బాగు చేసి లేదా పునర్నిర్మించి కొత్త వస్తువులుగా నమ్మించడం. C. అలా అమ్మచూపుతున్న సరుకులు లేక సేవలు ఫలానా వారి అనుమతితో ప్రమాణము కలిగి ఉన్నాయని (లేకున్నా) అబద్ధపు ప్రచారం చేయటం. D.ఆ సరుకులను (సేవలకు) లేని గుణాన్ని ఆపాదించడం,  అట్టి సరుకుల వల్ల లాభం పొందుతారని మభ్యపెట్టడం. E. ఏ పరీక్ష జరపకుండా అమ్మే వస్తువు (సరుకు) పనితనం,  నాణ్యత గురించి,  మన్నన కాల పరిమాణం గురించి తప్పుడు ప్రచారం చేయడం. E. అలాంటి వస్తువు (సరుకు)కు అబద్ధపు హామీలు ఇవ్వడం. అమ్మబడే వస్తువు ఖరీదు గురించి ప్రజ ప్రజలను తప్పుదారి పట్టించడం,  ఇతరుల అమ్మే వస్తువుల గురించి అబద్ధపు దారి పట్టించేటట్లు ప్రచారం చేయడం.

2. ప్రజలను మభ్య పెట్టడం లేక మోసగించుటకు వస్తువులను అతిగా అతి చౌకగా అమ్మ చూపుతున్నట్లు ప్రచారం చేయటం. 3. కొనుగోలుదారుడు కొంటున్న వస్తూ, సేవలకు బహుమతి, పారితోషకం వగేరా ఉచితంగా ఇస్తున్నట్లు మధ్య పెడుతూ ఆ వస్తువు ఖరీదును ముందుగానే హెచ్చించడం లేక లాటరీ నిర్వహించడం. 4. అమ్మ చూపుతున్న సరుకు (వస్తువు) సేవల నాణ్యత, ఉపయోగం, సరఫరా వగైరాలు నిర్దేశించిన రీతిన లేవని తెలిసి వాటిని అమ్మ చూపటం. 5. అమ్మచూపుతున్న వస్తువుల ధరలు అధికం చేయడం లేక నల్ల బజారులో అమ్మ చూపటం గురించి సరుకులను నిల్వ ఉంచడం, లేక సరుకు ఉన్న అమ్మడానికి నిరాకరించడం వగైరాలు వినియోగదారునికి చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి పేర్కొన్నారు.
భద్రత హక్కు: ఆస్తికి, ప్రాణానికి ముప్పు కలిగించే వస్తువు సేవలను వ్యాపారానికి ఉంచకూడదు. దీనికి వినియోగదారడే జాగరు కథతో చూసుకోవాలి. తాను కొనుగోలు చేసి సరుకు నాణ్యత ముద్ర అంటే ఐఎస్ఐ లేదా ఏజీ మార్కు కలిగి ఉందా అన్న విషయాన్ని చూసుకోవాలి.  వినియోగదారుడు తన హక్కుకు భంగము, నష్టము వాటిల్లుతున్నప్పుడు ఇబ్బంది నివారణ ఇలా పొందవచ్చును.
బాధితుడైన వినియోగదారుడు తనను వంచించిన వ్యాపారస్తుని విషయం గురించి అడగవచ్చు.  అతని నుంచి తనకు న్యాయం జరగనప్పుడు సంబంధిత వినియోగదారుల సంఘానికి చెప్పవచ్చు.  తరువాత వినియోగదారుడు స్వయంగా గాని, వినియోగదారుల సంఘం ద్వారా గాని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా గాని  వంచన జరిగిన పరిధికి సంబంధించిన జిల్లా వినియోగదారుల న్యాయస్థానము లేదా రాష్ట్ర ,జాతీయ వినియోగదారుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేయవచ్చును అని సాయి చౌదరి తెలిపారు.
దీనికి కోర్టు ఫీజు లేదు: ప్రత్యేక నమూనా (ఫిర్యాదు) లేదు.  ఫిర్యాదు చేయాల్సిన వినియోగదారుడు రాతపూర్వకంగా తనకు జరిగిన నష్టాన్ని విఫలముగా తెలియజేయాలి.  ఫిర్యాదు దారిని పేరు,  నివాస వివరాలు రాయాలి.  తనకు జరిగిన నష్టాన్ని ద్రోపరిచేందుకు కావలసిన వివరాలు, పత్రాలు, సరుకును తన ఫిర్యాదులో జతపరచాలి.  ప్రతివాది చిరునామా వివరాలు రాయాలి.  తాను కోరుకుంటున్న నష్టపరిహారము తెలపాలి. ఫిర్యాదు పైన ఫిర్యాదు దారుడు లేదా అతనిచే అధికారం పొందిన ప్రతినిధి సంతకం చేయవచ్చును.
వినియోగదారుడు అర్హుడైన పరిహారాలు: సరుకులలో లోకములను సవరించుట, సరిదిద్దుట. లోప భూయిష్టమైన సరుకును మంచి సరుకుతో మార్పిడి చేయించుట.  చెల్లించిన ఖరీదును తిరిగి పొందుట.  జరిగిన నష్టానికి పరిహారము పొందుట.  వినియోగదారుల న్యాయస్థానము విచారణ జరిపి ఈ పరిహారములు యుక్తమైన దానికి ఉత్తర్వునిస్తోంని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి అన్నారు.

వినియోగదారుల జిల్లా ఫోరం తీర్పుతో వాది లేదా ప్రతివాది సంతృప్తి చెందని పక్షంలో తీర్పు విలువడిని 30 రోజుల్లో రాష్ట్ర కమిషన్కు,  ఆ తీర్పుపై 30 రోజుల్లో జాతీయ కమిషన్కు అప్లై చేసుకోవచ్చును. ఇట్టి అప్పిళ్లకు కోర్టు ఫీజు ఉండదు. సరుకులు విలువ లేదా సేవలు విలువ,  నష్టపరిహారము 1,20,000 మించకుండా ఉంటే జిల్లా వినియోగదారుల న్యాయస్థానంలో విచారిస్తారు.  అలాంటి విలువలు 20 లక్షల రూపాయలకు మించి కోటి రూపాయల వరకు రాష్ట్ర కమిషన్,  కోటి రూపాయలు మించినట్లయితే జాతీయ కమిషన్ విచారణ చేయబడుతుంది. వినియోగదారులు ఈ చట్టాలపై అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి పేర్కొన్నారు.
ఫిర్యాదులు చేయాల్సిన సంస్థలు: 1. జాతీయ కమిషన్,  ఐదవ అంతస్తు, జనపద న్యూఢిల్లీ. 2.రాష్ట్ర కమిషన్,  ఆహార సరఫరా విభాగము,  హైదరాబాదు. 3. జిల్లా ఫోరం,  ఆహార సరఫరా విభాగం అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయములలో సంప్రదించవచ్చునని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి తెలిపారు.

Tags; Exploited users

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *