వ్యభిచారం ముసుగులో దోపిడీలు 

– ముఠాను అరెస్టు
Date:09/11/2018
నెల్లూరు ముచ్చట్లు:
అందంగా అలంకరించుకుంటారు…. తలలో మల్లెపూలతో జిగేల్ మనిపిస్తారు…. రాత్రి 10 గంటల తర్వాత బస్టాండ్ల వద్ద సంచరిస్తుంటారు…. బస్సు దిగి వెళ్లే వారిని ఆకర్షిస్తారు…. నీకు చుక్కలు చూపిస్తానంటూ మాయమాటలతో పడేస్తారు…. ఆటోలో శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి నిలువుదోపిడీ చేసి అక్కడి నుండి పరారవుతుంటారు…
. ఇటీవల నెల్లూరులో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లో కెళ్తే…. నెల్లూరు చంద్రబాబునగర్ కు చెందిన మొక్కల సరళ, భగత్ సింగ్ కాలనీకి చెందిన విడవలూరు మున్నీలు ఈ వ్యభిచారం ముసుగులో పురుషులను శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని దోపిడీ చేస్తుంటారు. వారికి చంద్రబాబునగర్ కే చెందిన కొంగ శ్రీనివాసులు సహకరిస్తుంటాడు.
ఈ క్రమంలో ఈనెల 1వ తేదీనా గూడూరులోని దివిపాళెంకు చెందిన పిన్ని వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటల సమయంలో నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆటో ఎక్కాడు. అదే ఆటోలో సరళ, మున్నీలు కూడా ఎక్కారు. శ్రీనివాసులుకు మాయమాటలు చెప్పి, అదే ఆటోలో శివారు ప్రాంతమైన చంద్రబాబునగర్ లోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో దిగగానే అతని చొక్కా, బనియన్ చించేసి అతని వద్ద ఉన్న 10వేలు నగదు, బంగారు ఉంగరం, సెల్ ఫోను ను బలవంతంగా తీసుకుని పరారయ్యారు.
దీనిపై ఆయన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన వేదాయపాళెం పోలీసుల బాధితుడు చెప్పిన వివరాలు, సమయం తెలుసుకుని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న సిసి టీవి ఫుటేజీని పరిశీలించారు. కిలాడీ లేడీలను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. వారికి సహకరించిన కొంగ శ్రీనివాసులును కూడా అరెస్టు చేశారు. కొంగ శ్రీనివాసులుపై సంతపేట, నెల్లూరురూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు వేదాయపాళెం పోలీస్ స్టేషన్ సిఐ నరసింహారావు వెల్లడించారు.
Tags: Exploits in the pursuit of adultery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *