పటాకుల తయారు కంపెనీలో పేలుళ్లు:ఇద్దరు మృతి

చెన్నై ముచ్చట్లు:

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని విరుధునగర్‌ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్‌పట్టిలో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి భవనం పైకప్పు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృంధాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెళికితీస్తున్నారు. ఆ కంపెనీకి పటాకులు తయారుచేయడానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో తరచూ పటాకుల తయారీ కంపెనీల్లో ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Explosions at a fireworks company: Two killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *