ఐదు జిల్లాలకు విస్తరించిన అల్లర్లు

Date:09/10/2018
గాంధీనగర్  ముచ్చట్లు:
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్‌’ ఇక పాత మాటేనా! హిందీ మాట్లాడే వలసవాదులపై దాడులతో గుజరాత్‌ రగిలిపోతోంది. వలస కార్మికులను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్న వీడియో దృశ్యాలను విపరీతంగా షేర్‌ చేస్తోంది. దాడులను రెచ్చగొడుతోంది. పరిస్థితి సమీక్షించి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాలని, చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా? అన్నది ఆలోచించాల్సిన రాజకీయ నాయకులు పరస్పరం బురద చల్లుకుంటున్నారుదాడులను ఎదుర్కోలేక బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వలసకార్మికులు తట్టా బుట్టా సర్దుకొని పారిపోతున్నారు. సబర్‌కాంత జిల్లాలో సెప్టెంబర్‌ 28వ తేదీన ఓ 14 ఏళ్ల బాలికను ఓ బిహారి రేప్‌ చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో బిహారీలకు వ్యతిరేకంగా ఒక్కసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది.
ఆ హింసాకాండ అనతికాలంలోనే హిందీ మాట్లాడే యూపీ, మధ్యప్రదేశ్‌ వలసకార్మికులపైకి మళ్లింది. అంతే సబర్‌కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, పఠాన్, మెహసాన జిల్లాలకు హింసాకాండ విస్తరించిందిఎప్పటిలాగే ఈ అల్లర్లలో కూడా సోషల్‌ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. పోషిస్తోంది. . బిహార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను చూస్తున్న గుజరాత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అల్పేష్‌ ఠాకూర్‌ను బీజేపీ, జెడీయూ పార్టీలు అనవసరంగా నిందిస్తున్నాయి. బిహార్‌లో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అల్పేష్‌ ఠాకూర్‌ను బీజేపీ నాయకుడు సమ్రాట్‌ చౌధరి హెచ్చరించారు.
Tags:Extended riots to five districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *