Date:30/11/2020
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్తీక మహాదీపోత్సవానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ 500 మంది మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిమ్మెలు, నేతి వత్తులు ఏర్పాటుచేశారు. మైదానం మొత్తం తివాచీలు ఏర్పాటుచేశారు. ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కను ఉంచారు. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందించారు.వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేదిక ఇరువైపులా ఆకట్టుకునేలా గంటలతో సెట్టింగ్ ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టిటిడి పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఒంటిమిట్ట లో కళ్యాణ వేదికను పరిశీలించిన ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి.
Tags: Extensive arrangements for Karthika Maha Dipotsava