శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి జెఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి జెఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు, లగేజి, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు విక్రయించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలు, నూతన సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉంచాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, శ్రీవారి సేవకులతో సేవలు అందించాలని సూచించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని తిరుపతి, చంద్రగిరి, ఇతర ప్రాంతాల నుండి శ్రీనివాసమంగాపురానికి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జనవరి 11వ తేదీలోపు ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, విజివో మనోహర్, ఇఇలు మురళి, మనోహర్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డిఇ(ఎలక్ట్రికల్) సరస్వతి పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Extensive arrangements for Vaikuntha Ekadashi at Srinivasamangapuram – TTD JEO Veerabrahman