నూతన పన్ను విధానానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రజాసంతకాల సేకరణ అరిగెల నాగేంద్ర సాయి

నెల్లూరుముచ్చట్లు:

 

 

సింహపురి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్ లోగల అరిగెల ప్లాజా నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి ట్యాక్స్ పేయర్స్  అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి మాట్లాడుతూ ,నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్థివిలువ ఆధారంగా నూతన పన్ను విధానాన్ని  ప్రజలకు నష్టం కలిగించేలా ఉందని బిజెపి పాలిత రాష్ట్రాలే వ్యతిరేకత చూపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం మోడీ మెప్పుకోసం ప్రజలమీద పన్నుల భారం మోపడానికి సిద్దమయ్యారు.అందులో భాగంగా ఆస్థి విలువ ఆధారంగా పన్నులు వసూళ్ళు , చెత్త పన్ను , మరుగుదొడ్ల పన్ను ,యూజర్ చార్జీల పేరుతో ప్రజల మీద ఆర్దిక భారం మోపడానికి జిఓ 196,197,198 లను తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో ప్రజలంతా అప్పుల ఊబిలో  మునిగిపోయి ఉన్నారు, వ్యాపరస్థులు , మధ్యతరగతి ప్రజలు , ఉద్యోగులు , కార్మికు లందరూ కూడా జీవనానికి సైతం అప్పులు చేసుకుంటున్నారు ,  కరోనా వలన కలిగిన నష్టాలకు అర్ధిక ఉద్దీపనలు ఇవ్వవలసింది పోయి వారిని ఇలా పన్నులు ద్వారా దోపిడీ చేయాలనుకోవడం ఈ రాష్ట్రముఖ్యమంత్రి కి తగిన విధానం కాదని , ఈ నిర్ణయాన్ని ఉపశంహరించుకోవాలని  సింహపురి టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యములో   ఆస్థివిలువ ఆధారంగా పన్నులు వేయడాన్ని తాత్కాలికంగా 2 సంవత్సరాలు వాయిదా వేసి , అనంతరం వివిద రాజకీయ పార్టీలు , వాణిజ్య , వ్యాపార సంస్థలు , ప్రజాసంఘాల తో అఖిలపక్షం వేసి తద్వారా ప్రజాభిప్రాయ సేకరణచేసి తగిన మార్పులు , చేర్పులతో  పన్నుల విధానం తీసుకురావాలని , జీఓ నెం 196 , 197 ,198 లను తక్షణమే ఉపసంహరించుకోవాలి .
నెల్లూరు నగరం నుంచి లక్షమందితో నిరసన పత్రాలను వ్యక్తిగతంగా సేకరించి వాటిని స్థానిక వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్రప్రభుత్వానికి పంపడానికి కార్యాచరణ తీసుకుని ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నగరంలో విస్తృతంగా చేపడుతున్నామని , అపార్ట్మెంట్ , నివాస గృహాలు , వ్యాపార సముదాయాలు ల యందు సింహపురి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్‌  ఆధ్వర్యములో కార్యకర్తలు  ప్రజలకు అవగాహన కల్పిస్తూ , మేము తయారు చేసిన నిరసన పత్రాల యందు  సంతకాలు సేకరిస్తూ , ఈ నెల 9 వ తేదీ న ఆ పత్రాలను తీసుకుని నెల్లూరు నగర మునిసిపల్  కమిషనర్కి పత్రాలను సమర్పించడం జరుగుతుందని , కావున ఈ కార్యక్రమానికిప్రజలందరూ సహకరించి   నూతన పన్ను విధానాన్ని  నిరసిస్తూ , సంతకాల ద్వారా మీ అందరి అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నామని అన్నారు.  ప్రపంచబ్యాంకు ఆదేశాలతో మోడీ ప్రజలను దోపిడీ చేస్తుంటే , జగన్ మోహన్ రెడ్డి  మోడీ అదేశాలప్రకారం , ఇయని వ్యక్తిగత అవసరాల కోసం మోడీ చేపట్టే ప్రజా వ్యతిరేఖ విధానాలను బలపరుస్తు జాతి గౌరవాన్ని మోడీ పాదాలవద్ద తాకట్టు పెట్టడం సరికాదు , ప్రజలందరూ కూడా వీరి పాలనను గమనిస్తున్నారని తగినబుద్ది చెప్పే సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. ఈ సమావేశంలో  వి.రామరాజు  , వాటంబేటి నాగేంద్ర , ఆదినారాయణ , సునీల్ ,  న్యాయవాదులు ప్రత్యూష్ , అజయ్ కుమార్ , శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Extensive collection of public signatures against the new tax system
Arigela Nagendra Sai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *