ఏపీలో పోలీసు అధికారుల పోస్టింగ్ కోసం విస్తృత ప్రయత్నాలు.

కీలక మైన స్థానాల్లో పోస్టింగుల కోసం వివిధ మార్గాలతో ప్రయత్నాలు.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో ఇంత కాలం లూప్ లైన్ లో ఉన్న అధికారులు మంచి పోస్టింగుల కోసం ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా పోలీసు శాఖలో హడావుడి కనిపిస్తోంది. డీఎస్పీ, ఎస్ఐ స్థాయి అధికారులు తమకు కీలకమైన స్థానాల్లో పోస్టింగుల కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.సీఐ, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఎస్ఐ వంటి పోస్టింగుల కోసం .. అనువైన ప్రాంతాలను ఎంచుకుని ఫలానా చోట తమకు పోస్టింగ్ ఇప్పించాలని రాజకీయ నేతలను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అనుకూలమైన అధికారుల్ని నియమించుకునేందుకు నేతల ప్రయత్నాలు

 

రాజకీయ నేతలు కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో తమ మాట వినే అధికారులే ఉండాలని అనుకుంటారు. అందుకే కొంత మంది అనుకూలమైన అధికారులను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిఫారసు లేఖలతో తమ వద్దకు వచ్చే వారితో మాట్లాడుతున్నారు. నిజానికి ఇలాంటి బదిలీల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే అవకాశం ఉంటుంటుంది. అయితే డబ్బులు తీసుకుని పోస్టింగులు ఇప్పిస్తే తమ మాట వినరని ఎక్కువ ప్రజాప్రతినిధులు.. తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

కీలకమైన చోట్ల పోస్టింగులు పొందేందుకు అధికారుల ప్రయత్నాలు

అధికార పార్టీలో ఉంటే సరిపోదని.. తమ మాట వినే అధికారులు కూడా ఉండాలని ఎమ్మెల్యేలు కోరుకుంటారు. ప్రస్తుతం సీఐల స్థాయిలో పని చేసిన వారిలో .. డీఎస్పీల స్థాయిలో పని చేసిన వారిలో ఎక్కువ మంది ఒకే సామాజికవర్గానికి వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారు కూడా .. తమకు బదిలీ చేసినా మంచి చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు అధికార కూటమిలోనూ మూడు పార్టీల సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. అయితే పై స్థాయి ఇంకా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయలేదు. కింది స్థాయిలో ఇంకా కసరత్తు ప్రారంభం కాలేదని అధికారవర్గాలంటున్నాయి .

సిన్సియార్టీనే ప్రయారిటీగా బదిలీలు ఉంటాయంటున్న ప్రభుత్వం

పోలీసు సిబ్బంది బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యూనిట్ ఆఫీసర్స్ సూచనల మేరకే ఈసారి పోస్టింగ్స్ ఉంటాయని.. ఒక్కో సర్కిల్, ఎస్ హెచ్ ఓ పోస్టులకు మూడు పేర్లతో ప్రతిపాదనలు అనే కొత్త రూల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. లిస్టులోని మూడు పేర్లలో ఒక పేరును డీజీపీ ఆఫీసే ఖరారు చేయనుంది. ముందు IPS, తరువాత apps అధికారులు….అటు తరువాతే సిఐ, ఎస్ఐ బదిలీలు ఉంటాయంటున్నారు.

 

 

Tags:Extensive efforts for the posting of police officers in AP.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *