Extensive police raids on illegal liquor shipments

అక్రమ మద్యం రవాణాలపై విస్తృతంగా పోలీసు బృందాల దాడులు

Date:09/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా ఎస్.పి  ఎస్.సెంథిల్ కుమార్, IPS   ఆదేశానుసారం ASP SEB   వై.రిశాంత్ రెడ్డి, IPS  స్వీయ పర్యవేక్షణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారి ప్రాంతాలు, అక్రమ మద్యం రవాణాలపై, హన్స్ మరియు పొగాకు ఉత్పత్తుల పై విస్తృతంగా పోలీసు బృందాల దాడులు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికై ప్రతిష్టాత్మకంగా ఏర్పరచిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తన దూకుడు ని పెంచింది. జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తూ అక్రమార్కులకు సింహస్వప్నం గా మారుచున్నది. జిల్లా యందు గత మూడు నెలలు గా స్ధానిక పోలీసుస్టేషన్లు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయంతో కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు.

1) అక్రమ మద్యం విక్రయాలు, రవాణా… నాటు సారా తయారీపై చర్యలు
35,426 బాటిల్ ల మద్యం, 1,602 టెట్రా పాకెట్లు, 7,291 లీటర్ల నాటు సారా స్వాధీనం. 89,563 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం. స్వాధీనం చేసుకొన్న మద్యం విలువ సుమారు 1 కోటి.
2) ఇసుక అక్రమాలపై చర్యలు..
170 కేసులు నమోదు… 268 మంది అరెస్టు…216 వాహనాలు సీజ్
3) COPTA కేసులు
4,54,187 హన్స్ ప్యాకెట్ లు, 4,44,000 గుట్కా ప్యాకెట్ లు మరియు పొగాకు ఉత్పత్తులు స్వాధీనం. వీటి విలువ సుమారు 2 కోట్లు వరకు ఉంటుంది.ఈ సందర్భంగా ఎస్పి   మాట్లాడుతూ ప్రభుత్వo నిర్దేశించిన మార్గదర్శకాల నియమ నిబంధనల ఆధారంగా ఇసుక రవాణా చేయవలెనని, ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ చిత్తూరు జిల్లా నందు ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికై 101 చెక్ పోస్ట్లు మరియు 10 మొబైల్ పార్టీలను జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగిందని, కొంతమంది సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమ మార్గాలను ఎంచుకుని నాటు సారా తయారీ, నాటు సారా, కర్ణాటక మద్యంల అక్రమ రవాణా కు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.

 

 

 

ఈ అక్రమ రవాణాకు గాని, వ్యాపారానికి గాని వాహనాలను ఉపయోగించి, లక్షల రూపాయలను నష్ట పోయి మరింత కష్టాలలోకి వెళ్లకూడదన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు నుండి మద్యం అక్రమ రవాణా నాటు సారా రవాణా లపై ప్రతేక నిఘా ఉందని ప్రజలు కూడా తమ వంతు భాద్యత గా తమ పరిసరాల్లో ఎక్కడైనా, ఎవరైనా ఇసుకను, మద్యం ను అక్రమంగా రవాణా చేస్తున్న నాటుసారా తయారు చేస్తున్న SEB నెం 9440900004 కు గాని, డయల్ 100 కు గాని, పోలీసు WHATSAPP నెం 9440900005 కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు అని, సమాచారం ఇచ్చిన వారి వివరములు పూర్తి గోప్యం గా ఉంచబడునని జిల్లా ఎస్.పి  తెలిపారు.

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Tags: Extensive police raids on illegal liquor shipments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *