ప్రవేట్ విద్యాసంస్థల్లో చేస్తున్న ఫీజుల దోపిడీలని అరికట్టాలి
పుంగనూరు ముచ్చట్లు :
ప్రవేట్ విద్యాసంస్థల్లో చేస్తున్న ఫీజుల దోపిడీలని అరికట్టాలి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి అరికట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు .శనివారం ప్రజాసంఘాల నాయకులు రాజు మాట్లాడుతూపట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ విద్య సంస్థలు చేస్తున్న ఫీజులు దోపిడీలను అరికట్టాలని జీవో నెంబర్ 142 అమలు చేయాలని ఫీజులు నోటీస్ బోర్డులో పొందుపరచాలనిడిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ ని బంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజులను అక్రమంగా వస్తువులు చేస్తున్నారని . ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యను వ్యాపారంగా చూస్తున్నారని పేర్కొన్నారు.

బహిరంగంగానే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని చేస్తున్న విద్యశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అములు చేయకుండా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ తదితర మెటీరియల్ అంత ఆయ పాఠశాలల్లో కొనుగోలు చేయాలని బయట కొనుగోలు చేసిన పాఠ్య పుస్తకాలు పాఠశాలలో ఉపయోగపడవని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి 10వేలు రూపాయలు వరకు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు పాల్పడే పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బాలాజీ శంకరప్ప సుబ్బన్న బర్కత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Extortion of fees in private educational institutions should be stopped
