కూరగాయల దాతలతో అదనపు ఈవో భేటీ

Date:05/12/2019

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ అన్నప్రసాధ విభాగానికి కూరగాయలు అందిస్తున్న దాతలతో గురువారం  ఉదయం స్థానిక అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు టీటీడీ అదనపుఈవో ధర్మారెడ్డి. దాతల సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో అయన మాట్లాడారు. 2005 నుండి ఇప్పటివరకు టీటీడీ డబ్బు పెట్టి కూరగాయలు కొనలేదని దాతల సహాయంతో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు. దాతల సహాయంతో టీటీడీకి 120 కోట్ల మేరకు ఆదాయం చేకూరిందని వివరించారు. ఇప్పటివరకు 26 రకాల కూరగాయలు అందిస్తున్నారని, వీటితో పాటు మరి కొన్ని రకాల కాయకూరలు అందించాలని కోరామన్నారు. 2018,19 లో 1,572టన్నుల కూరగాయలను అందించారన్నారు. 2019 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 1200 టన్నుల కూరగాయలను దాతలు ఇచ్చారని తెలిపారు. దాతల సహాయంతో గత బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నప్రసాధాలను నిర్విరామంగా అందించామన్నారు.  అందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఓ సారి దాతలతో సమావేశం అవుతునట్టు పేర్కొన్నారు.  బియ్యం దాతలు కూడా ముందుకు వస్తున్నారని వారి ద్వారా ఇప్పటివరకు 55 టన్నుల బియ్యం టీటీడీకి విరాళంగా అందిందన్నారు. ఈ నెల 13 న రైస్ డోనర్స్ తో సమావేశం అవుతున్నట్టు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎపి,తెలంగాణ,తమిళ,కర్ణాటక రాష్ట్రలనుండి కూరగాయల దాతలు పాల్గొన్నారు. వీరిని పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు.

 

పత్తి రైతుల  ధర్నా

 

Tags:Extra evo visitation with vegetable donors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *