దేవాదులకు అదనపు భూమి సేకరణ ప్రక్రియ

Extra land acquisition process for Devadas

Extra land acquisition process for Devadas

Date:21/11/2019

వరంగల్ అర్బన్ ముచ్చట్లు:

దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ అదనంగా అడిగిన భూమి సేకరణ ప్రక్రియను పూర్తి చేసి నెల రోజులలో అప్పగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ తెలిపారు. అవసరమైతే జనరల్ అవార్డ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటనను పురస్కరించుకొని దేవెన్నపేటను సందర్శించి  అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి గురించి దేవాదుల ప్రాజెక్టు ఎస్.ఇ.ఎ.సుధాకర్ రెడ్డి, ఆర్డిఓ కె.వెంకారెడ్డితో చర్చించారు. ఆసియాలోనే అతి పెద్దదైన 49 కిలో మీటర్ల టన్నెల్ పనులలో ఇంకా 5.4 కిలో మీటర్లు పెండింగ్ లో ఉన్నది. అదేవిధంగా  దేవెన్నపేటలో నిర్మిస్తున్న 142 మీటర్ల సర్జిపుల్ పనులలో 42 మీటర్లు లోతు పూర్తియింది. 2020 నవంబర్ వరకు నూరు శాతం పనులను పూర్తి చేయవలసి ఉన్నది. సర్జిపుల్ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మించడానికి  టెండర్ లను పిలిచారు.

 

అలిపిరి బైపాస్ లో రవాణాకు సిద్దంగా ఉన్న ఎర్ర చందనం పట్టివేత

 

Tags:Extra land acquisition process for Devadas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *