వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది

చిత్తూరు ముచ్చట్లు :

 

వివాహేతర సంబంధం వ్యక్తి ప్రాణం తీసిన ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం వెంగమాంబపురం ఆధిఆంధ్రావా డలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రబాకర్(40)కు పది సంవత్సరాల క్రితం తిరుపతి లోని రాయలచెరువు సమీప గ్రామంలో తులసితో వివాహమైంది. ఆమె అక్క రాధికకు తమిళనాడు రాష్ట్రం ఆర్కేపేటకు చెందిన గురుస్వామి(45) తో వివాహమైంది. గురుస్వామి తులసితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై ప్రబాకర్ తరచు భార్యతో గొడవ పెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో తులసి అమ్మగారింటికి వెళ్ళిపోయింది.ప్రబాకర్ అప్పటి నుండి తాగుడుకు బానిస అయ్యాడు.

 

ఎలా అయినా ప్రభాకర్ ను చంపేయాలని గురుస్వామి పథకం వేశాడు. ఈ నెల 18 వ తేదీన గురుస్వామి తన స్నేహితుడు తిరుమల(20)తో కలసి పథకం ప్రకారం ప్రబాకర్ ను తమిళనాడు కి తీసుకొని వెళ్లి పూటుగా మద్యం తాగించి తిరిగి ఇంటికి వస్తున్న దారిలో చంపేశారు. వెంగమాంబపురం సమీపంలోని ఒక గుట్టలో చిన్న గుంత ఉండగా అక్కడకు తీసుకెళ్లి పూడ్చి పెట్టి వెళ్లి పోయారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Extramarital affair took lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *