పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 24న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని , చికిత్సలు చేసుకోవాలని కోరారు.
Tags; Eye camp at Punganur on 24th