పుంగనూరులో లయ న్స్ క్లబ్‌చే 80 మందికి కంటి వైద్య పరీక్షలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ పి.శివ, క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన వైద్యశిబిరంలో 80 మందికి చికిత్సలు చేశారు.వీరిలో 30 మందికి ఐఓఎల్ ఆపరేషన్లు చేయనున్నట్లు డాక్టర్ శివ తెలిపారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఆపరేషన్లు చేసి, ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శ్రీరాములు, త్రిమూర్తిరెడ్డి, సత్యనారాయణగుప్తా, రఘునాథరెడ్డి, గోపాలకృష్ణ, అమరావతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Eye examinations for 80 people by the Lions Club in Punganur