కన్నుల పండువగా పట్టాభిషేకం

Date:27/03/2018
భద్రాచలం ముచ్చట్లు:
భద్రాచలంలో శ్రీరాముల వారి పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. దేశంలోని పుణ్య నదీజలాలు ఒక్కచోటికి చేరుకోగా, వేదమంత్రాల సాక్షిగా రాముడు పట్టాభిషిక్తుడ్ని చేశారు.. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసి తరించేందుకు భారీ స్థాయిలో భక్తులు తండోపతండాలుగా భద్రాచలానికి చేరుకున్నారు. భక్తులు చేస్తున్న శ్రీరామ నామ స్మరణతో భద్రాద్రి కొండ మారుమోగిపోతోంది.శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నవమి రోజు కల్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది. మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం కనుల విందుగా సాగుతోంది. శ్రీత్రిదండి చినజీయర్ స్వామి ఈ క్రతువునకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీతాసమేతంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం రాజదండం, రాజఖడ్గం, రాజముద్రిక ఒక్కొక్కటిగా స్వామివారికి అలంకరించారు. అంతకుముందు భద్రాద్రి రాముడికి చినజీయర్ పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. పట్టాభిషేకం కోసం దేశంలోని గంగా, యమున, సరస్వతి, కృష్ణా, కావేరి, తుంగభద్ర నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకువచ్చారు.నందన నామ సంవత్సరం చైత్రశుద్ధ మాసం ఆదివారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఆదివారం ఘనంగా జరిగింది.శ్రీరామచంద్రుని గుణగణాలతో పాటుగా శ్రీరామరాజ్యం వైభవాన్ని వేదపండితులు వివరించారు.పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్ అన్న నినాదాలతో మిథిలా ప్రాంగణం మార్మోగుతోంది. స్వామి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను చేశారు.
Tags:Eye of the eyes is the corpse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *