50 రోజులు పూర్తి చేసుకున్న ఎఫ్ 2

F2 completed 50 days

F2 completed 50 days

Date:02/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఈరోజుల్లో ఓ సినిమా 50 రోజులు పూర్తిచేసుకోవడం చాలా కష్టమైపోతోంది. ఒక వేళ పూర్తిచేసుకున్నా మహా అయితే ఓ 50 నుంచి 60 సెంటర్లలో పూర్తవుతుంది. కానీ ‘ఎఫ్ 2’ విషయంలో ఆ లెక్కలు మారాయి. చాలా కాలం తరవాత ఎక్కువ సెంటర్లలో ఓ తెలుగు చిత్రం 50 రోజులు పూర్తిచేసుకుంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా.. వరుణ్‌కు సరసన మెహ్రీన్ నటించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఈ పోస్టర్లపై 106 కేంద్రాల్లో ‘ఎఫ్ 2’ 50 రోజులు పూర్తిచేసుకున్నట్లు ముద్రించింది.
Tags; F2 completed 50 days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *