కర్మాగారంలో అగ్ని ప్రమాదం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని నెక్కంటి కాటన్ కోరమండల్ కర్మాగారం నందు గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని నెక్కంటి కాటన్ కోరమండల్ కర్మాగారం నందు గురువారం తెల్లవారుజాము నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Tags: Factory fire risk