30 నుంచి మాగాండ్లపల్లెలో జాతర
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని మాగాండ్లపల్లె గ్రామంలో ఈనెల 30నుంచి మూడు రోజుల పాటు శ్రీబోయకొండ గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా గ్రామస్తుల సహకారంతో నిర్మించిన శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారి జాతరను గ్రామస్తులతో కలసి నిర్వహిస్తున్నామన్నారు. 30న మండల పూజ, 31న దీపారాధన, ఫిబ్రవరి 1న గంగమ్మజాతర నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతరలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలని కోరారు.

Tags; Fair at Magandlapalle from 30
