Natyam ad

పుంగనూరులో టిట్కోగృహాల వద్ద జాతర…

-1536 మంది లబ్ధిదారుల హర్షం
-ఒకొక్క ఇంటి విలువ రూ.15 లక్షలు
-రూ.110 కోట్లతో నిర్మాణాలు
– మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లి వద్ద జగనన్న కాలనీ ఏర్పాటు చేసి , అందులో టిట్కో గృహాలను అత్యంత సుందరంగా నిర్మించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమ్యిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో 1536 ఇండ్లను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌లు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. జగనన్న జిందాబాద్‌… పెద్దిరెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు.

నిర్మాణాలు…

పట్టణ సమీపంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో టిట్కో గృహాలను సుమారు రూ.10 కోట్లు విలువ చేసే 5 ఎకరాల భూమిలో 1536 గృహాలను రూ.100 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. ఇండ్ల నిర్మాణాలను ఎంతో నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. 30 అడుగుల వెడల్పు గల సిమెంటు రోడ్లు , కాలువలు రూ.10 కోట్లతో నిర్మించారు. అలాగే ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా పైపులైన్లు వేసి ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వద్ద టిట్కో ఇండ్లకు సిమెంటు రోడ్డు వేసి ఆర్చి నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా వెహోక్కలు నాటి జగనన్న పచ్చతోరణం ఏర్పాటు చేశారు. టిట్కో కాలనీ ప్రాంతంలో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో సుందర పట్టణంగా రూపుదిద్దుకుంది.

అంతా ఉచితం…

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కోగృహాలు ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లభ్ధిదారుల వద్ద నుంచి ఒకొక్కరి వద్ద రూ.2.65 లక్షలు వసూలు చేయాలని జారీ చేసిన జీవో 58ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసి అంతా ఉచితమేనని ప్రకటించింది. అలాగే రూ.15 లక్షలు విలువ చేసే ఇంటిని సైతం ఒక్కరూపాయి కూడ చెల్లించకుండ లబ్ధిదారుల పేరున రిజిస్ట్రర్‌ చేసి ఇవ్వడంతో లబ్ధిదారుల ఆనందాలకు హద్దులేకపోయింది.

అందరికి పక్కా ఇల్లు …

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో టిట్కో ఇండ్లు , జగనన్న కాలనీలు మంజూరు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో నామమాత్రంగా ఇండ్లు కేటాయించి, లబ్దిదారుల వద్ద డబ్బులు వసూలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షలు విలువ చేసే స్థలంతో పాటు రూ.5 లక్షలతో నిర్మించిన ఇండ్లు ఉచితంగా అందజేసి సువర్ణ అధ్యాయం ప్రారంభించడం జరిగింది. దేశంలోనే ఏపి గృహ నిర్మాణాలలో అగ్రస్థానంలో నిలిచింది.


– రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

నాకు సొంత ఇల్లు ఉండదనుకున్నా…

నేను, నాభర్త కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాము. నాభర్త ఇల్లు కట్టుకుందామనుకున్న కోరిక నేరవేరలేదు. జగనన్న ముఖ్యమంత్రి కావడంతో మాకు అమ్మ ఒడి, ఆసరా, పావలావడ్డి రుణాలతో పాటు టిట్కో గృహాన్ని ఇచ్చి, నాకల నేరవేర్చారు. జగనన్న మేలు మరవలేం. మేము ప్రచారం చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటాం.

– శాంతమ్మ, మంగళంకాలనీ, లబ్ధిదారు.

నమ్మలేకపోయాం…

పట్టణ సమీపంలో ఖరీదైన స్థలంలో సుందరంగా ఇల్లు నిర్మించి ఇస్తారనే మాటలు నమ్మలేకపోయాం. జగనన్న మాట నిలుపుకున్నారు. పేదవారైన మాకు పక్కా గృహాలు ఉచితంగా ఇవ్వడం నమ్మలేకపోయాం. రిజిస్ట్రర్‌ చేసి ఇండ్లు ఇచ్చారు. జగనన్న రుణం తీర్చుకోలేం.

– లుక్సానా, లబ్ధిదారు, పుంగనూరు.

పేదరికమే అర్హత…

పేదరికంలో ఉన్న మాకు పక్కా గృహాలు, ప్రభుత్వ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగనన్నకు రుణపడి ఉంటాం. వలంటీర్లను ఇంటిపి పంపి మా సమస్యలు గుర్తించి మాకు టిట్కో ఇల్లు ఇవ్వడం ఊహించలేకపోతున్నాం. గతంలో తిరిగిన మాకు ఇల్లు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఇంటి వద్దనే అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు.

– షాతాజ్‌ , లబ్ధిదారు, పుంగనూరు.

 

Tags: Fair at Titkogriha in Punganur…

Post Midle