నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం..పది మంది అరెస్టు
రంగారెడ్డి ముచ్చట్లు:
సైబరాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసారు. మేడ్చల్, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందాలు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి 3.35 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీవిత్తనాల విలువ దాదాపు 95 లక్షలనుంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Tags; Fake cotton seeds seized..10 people arrested

