Fake gold jewelry business at Corona lockdown in Punganur

పుంగనూరులో కరోనా లాక్‌డౌన్‌లో నకిలి బంగారు నగల వ్యాపారాల జోరు

– బెంబేలెత్తిపోతున్న జనం
– పట్టించుకోని అధికారులు

Date:02/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఓ వైపు కరోనా వ్యాది ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటే మరో వైపు పట్టణంలోని కొంత మంది బంగారు వ్యాపారులు నాణ్యతలేని నకిలి బంగారు నగలు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పట్టణంలో సుమారు 30 బంగారు షాపులు ఉన్నాయి. పుంగనూరు ప్రధాన కేంద్రం కావడంతో మూడు నియోజకవర్గాలకు చెందిన సుమారు లక్ష మంది ప్రతి రోజు పుంగనూరుకు వచ్చివెళ్తుంటారు. ఇందులో అధికభాగం గ్రామీణ ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు చైన్లు, తాళిబొట్లు,
నక్లెసులు, గాజులలో నాణ్యతలేని బంగారును సుమారు 40 శాతం బంగారుతో తయారు చేసిన నగలను 100 శాతం లేదా 80 శాతం బంగారు ఉందని చెప్పి అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను లూటి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటపడి నిలదీసే వారికి మంచిబంగారు నగలు ఇవ్వడం, లేకపోతే తమ వద్ద కొనుగోలు చేయలేదని బుకాయించడంతో పేద ప్రజలు నిస్సాహాయులై కుమిలిపోతున్నారు. ఇలాంటి తతంగాలు ముఖ్యంగా బజారు  విధిలోని రెండు దుకాణాలు, నాగపాళ్యెం, బస్టాండు రోడ్డులో గల మూడు దుకాణాల వారు ఇలాంటి నాణ్యత లేని నకిలి బంగారాన్ని బహాటాంగా విక్రయిస్తున్నారని పట్టణ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం ఒక యువకుడు బంగారు చైన్లు కొని మోసపోవడంతో ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే పేద ప్రజల సంపదను కొంత మంది బంగారు వ్యాపారులు దోచుకోవడం పెట్రేగిపోతోంది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఒక లక్ష ఋణం

Tags: Fake gold jewelry business at Corona lockdown in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *