Natyam ad

నకిలీ విలేకరుల ఆటకట్టు

-పోలీసుల పేరుతో దందాలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ విలేకర్ల అరెస్ట్
పరారీలో మరోకరు
 
రాజమండ్రి ముచ్చట్లు:
 
రాజమహేంద్రవరం ఒక వ్యాన్ డ్రైవర్ ను బెదిరించి పోలీసులమని డబ్బులు డిమాండ్ చేసి డ్రైవర్ వద్ద సెల్ఫోన్ లాక్కున్న ఘటనలో ఇద్దరు నకిలీ విలేకరులను రాజమహేంద్రవరం అర్బన్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు . ఇందులో భాగస్వామ్యం అయిన మరొక నకిలి విలేఖరి పరారీలో ఉన్నాడు . వివరాల్లోకి వెళితే తాడితోట కి చెందిన జగదీష్, ఇన్నిస్ పేటకు చెందిన గాదే గిరీష్ కుమార్ గుప్త (ప్రజా వార్త) (శ్రద్ధ వాణి) ఐ ఎల్ టి డి కి చెందిన అబ్బ భత్తుల ఉమామహేశ్వరరావూ(పొట్టి మహేష్) ఏ1 న్యూస్, చానల్, దివ్య దర్శిని డైలీ న్యూస్ లలో విలేకరులు గా చేస్తున్న ఈ ముగ్గురు బుధవారం అర్ధరాత్రి విశాఖపట్నంకు చెందిన తానే సతీష్ అనే వ్యాన్ డ్రైవర్ కోళ్ళ మేత ను పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి లో దించి వ్యాన్ తో విశాఖపట్నం బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద కు వచ్చే సరికి నిద్ర వస్తున్న సతీష్ వ్యాన్ పక్కన పెట్టి నిద్రిస్తుండగా జగదీష్ , గిరీష్ కుమార్ గుప్తా, అబ్బా బత్తుల ఉమామహేశ్వరరావు లు డ్రైవర్ ను నిద్రలేపి వ్యాన్ కాగితాలు ఇమ్మని , రాంగ్ రూట్లో పెట్టావని పోలీసులమని , 3000 రూపాయలు ఫైన్ కట్టమని డిమాండ్ చేశారు . లేకపోతే యూట్యూబ్ చానల్స్ , అన్ని పత్రికల్లో వ్యాన్ తోపాటు ప్రసారం జరుగుతుందని బెదిరించారు . వ్యాన్ డ్రైవర్ ఇవ్వనని చెప్పడంతో అతని జేబులో ఉన్న సెల్ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు . దీనిపై బాధితుడు సతీష్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ ముగ్గురు నకిలీ విలేకర్లు దొరికారు . దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గిరీష్ కుమార్ గుప్తా , అబ్బా బత్తుల ఉమామహేశ్వరరావు ను అరెస్టు చేశారు . జగదీష్ పరారీలో ఉన్నాడు . దీనిపై కొందరు మీడియా వారు కేసు కట్టకుండా వాళ్లను వదిలేయడానికి పోలీసులతో చర్చలు జరిపారు . తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేసి  వారిని రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు . పరారీలో ఉన్న జగదీష్ వివరాలు తెలియవలసి ఉంది . ఇతను ఏ పత్రిక ఏ ఛానల్ లో పని చేస్తున్నాడు? టూ టౌన్ పోలీసులు పొట్టి మహేష్ కు సంబంధించిన ఏ1 న్యూస్ , దివ్య దర్శిని ఐడీ కార్డులను , గాదె గిరీష్ కుమార్ గుప్తా కి సంబంధించిన శ్రద్ధ వాణి న్యూస్ పేపర్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు . ఈ గిరీష్ కుమార్ గుప్త అనే వాడు ప్రజా వార్త అనే పేపర్లో తను అక్రిడేషన్ జర్నలిస్ట్ ని అని బయట చెప్పుకుని తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి అని తెలిపారు .
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Fake journalists’ game