నకిలీ నక్సలైట్ల కలకలం

The Naked Naxals in Chhattisgarh

The Naked Naxals in Chhattisgarh

Date:12/06/2019

విజయనగరం  ముచ్చట్లు:

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం గిరిజన ఏజెన్సీ  గ్రామాల్లో నక్సలైట్లమంటూ నకిలీ నక్సలైట్లు హల్ చల్ చేసారు చివరికి పోలీసులకు చిక్కారు.  మవోయిస్టుల అవతారమెత్తి  బెదిరింపులు

కాల్స్ చేస్తూ  గత కొద్దికాలంగా లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు  నలుగురు నకిలీ నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు ఆర్నిపల్లి.

ధనుంజయ్ నాయుడు,  మరిసర్ల. భాను ప్రకాష్, కలిపిండి ఏడుకొండలు, పటలసింగ్  విద్యసాగర్ లు గత కొద్దికాలంగా చెడు వ్యసనాలకు బానిసై  గ్రామాల్లో డబ్బు  పలుకుబడి ఉన్న వ్యక్తులను

గుర్తించి ఫోనుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత రెండు నెలలుగా వీరు ఒక పార్టీకి చెందిన వ్యక్తి బొంగు చిట్టినాయుడు, ఎల్ఐసీ ఏజెంట్  భోగి గౌరినాధ్ లను బెదిరించి  ఐదు లక్షల

రూపాయలు వసూలు చేశారు. తరువాత రెండు రోజుల నుంచి చెముడు గ్రామానికి చెందిన అక్కేనా  రామినాయుడు కి   బెదిరింపు కాల్స్ చేస్తూ మేము నక్సలైట్లమంటూ హెచ్చరించారు. డబ్బులు

ఇవ్వకపోటే  అంతు తేలుస్తా అంటూ బెదిరించారు. దాంతో  భయపడిపోయిన రామి నాయుడు నిందితులతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని లక్షా ముప్పై ఐదు వేలు ఇస్తానని చెప్పాడు.

అందులో భాగంగా పాచిపెంట మండలం పారమ్మకొండ చెరుకుపల్లి బస్టాప్ వద్ద రహస్య ప్రదేశాన్ని ఎన్నుకున్ఆరు. ఈ ఈ విషయాన్ని రామినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో రంగంలోకి

సాలూరు సర్కిల్ పోలీసులు పకడ్బందీ వ్యూహంతో పట్టుకున్నారు.  వీరి వద్ద నుండి సుమారు లక్షా యాభై వేల రూపాయలు రికవరీ రికవరీతో పాటు మూడు సెల్ ఫోన్లు ఒక బైకు స్వాధీనం చేసుకుని

వారిని రిమాండ్ కు  తరలించారు.

విఆర్వోలను నిర్బంధించిన గ్రామస్తులు

Tags:Fake Naxalites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *