కొంప ముంచిన నకిలీ విత్తనాలు.. ఆందోళనలో రైతులు

Date:23/10/2020

ఖమ్మం ముచ్చట్లు:

రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయారు. అసలే అకాల వర్షలతో ఇప్పటికే   నష్టపోయిన తైతులకు , ఈ నకిలి షీడ్  మరింత క్రుంగ దిసింది, చేతికి పంట వచే సమయంలో  ఒక్క పేరు పొందిన షీడ్ సంస్థ ఇచ్చిన షీడ్  వల్ల వేంసూరు మండలంలోనే వందల ఎకరాలు పంట నష్టం వాటిలింది.
-ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లో వరి సాగు చేస్తున్న రైతుల దీన గాధ, డిలర్ మాటలు నమ్మి  కొత్తరకానికి చెందిన నాగార్జున ఎన్టీయూ 1224 బ్యాచ్ నెంబర్ 90003 రకం  వరి కొనుకోలు చేసి మోసపోయారు. 130 రోజులు అయినా ఇప్పటివరకు వరి పుష్పించే దశ రాకపోవడంతో రైతులు  అందోళన చెందుతున్నారు.

 

మరోవైపు,  కౌలు రైతుల దీన గాధ వర్ణనాతీతం.  తమ కౌలుకు తీసుకున్న భూమి కి కౌలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, పేరుపొందిన షిరిడి విత్తనాలు వేశామనే ధీమాతో ఉన్న తమకు ఇలా మోసం జరుగుతుందని ఊహించలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.విత్తన కాల పరిమితి 145 రోజులు,పుష్పించే దశ 115 రోజులు కానీ 130 రోజులైనా ఇంతవరకూ పుష్పించే దశ రాలేదని వాపోయారు. వరి పంట పూర్తిగా పా డైపోయిందని కనుక మోసపోయిన రైతులకు ప్రభుత్వం చోరవ తీసుకోని  నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమను నకిలీ విత్తనాలతో మోసం చేసిన కంపెనీపై చర్యలు చేపట్టాలని, తమకు నకిలీ విత్తనాలు అంటగట్టిన డిస్ట్రిబ్యూటర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

రైతుల ఆరెస్టు

Tags: Fake seeds dipped in perch .. Farmers worried

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *