నకిలీ ముద్రలు, పట్టా మూడు సెంట్లు పట్టా బుక్కులు స్వాధీనం

-జిల్లా ఎస్పీ అన్బురాజన్

బద్వేలు ముచ్చట్లు:

బద్వేల్, గోపవరం చుట్టు ప్రక్కల మండలాలలో నఖిలీ పట్టాలు తయారు చేసి అక్రమ భూదందాకు పాల్పడుతున్న  ఆరు మంది ముఠా సభ్యులను బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్  తెలిపారు, కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ పటాలు తయారు చేసే17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిలో ఆరు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు, అరెస్టయినవారిలో బద్వేల్ టౌన్ సుమిత్ర నగర్ చెందిన రవి శంకర్, గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీకి చెందిన మన్యం బాపు రావు, బద్వేల్ సుమిత్ర నగర్ కు చెందిన రవి కుమార్, బద్వేలు గాంధీనగర్ చెందిన కొడవలి వేణుగోపాల్, బద్వేలు తిప్పన పల్లి గ్రామం చెందిన గొల్లపల్లి రాజు, బద్వేలు గాంధీనగర్ చెందిన పుంగనూరు మురళి లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు,బత్తిన రవి శంకర్ కు చెందిన ఇంటిపై రైడ్ చేసి, ఇంటిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అధికారులకు సంబంధించిన 7 ప్లాటు సీల్లు, 13 రౌండు సీల్లు, నకిలీ అనుబంధ ఫారాలుడి.కె.టి పట్టాలు-2, పూరించని అనుబంధ పత్రాలు మరియు ఇంటి నివేశన మంజూరు పత్రాలు-379 నకిలీ పాసుపుస్తకాలు-60, పూరించని పాసుపుస్తకాలు నమూనాలు -82 గోపవరం కార్యాలయమునకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిజిష్టర్లు-2, ఆర్.యస్.ఆర్ నకల్లు-3, డి.కె.టి ఫైల్లు 10, ఆధారుకార్డు జిరాక్సులు-

 

 

 

118, పూరించని భూమి శిస్తు రసీదులు-33 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, మన్యం బాబురావు, బత్తిన రవిశంకర్, ధర రవికుమార్, పుంగనూరు మురళి, భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, కొలవాలి వేణుగోపాల్, పైడికాల్వ వెంకటరమణ, కంబాల బుజ్జి, రవికుమార్, సాయి ప్రమోద్, పోకల సుబ్బారెడ్డి, ఈగ యారదా రెడ్డి,పల్లె రాము,గొల్లపల్లి పుష్ప రాజు తో పాటు మహిళ అయిన ప్రియాంక మరికొంతమంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి విఆర్ఓ అయిన రవి కుమార్ అలియాస్ రవీంద్ర  కుమార్ సహాయంతో సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నకిలీ ముద్రలు తయారుచేసి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్రజలను మోసగిస్తూ అసలు పత్రాలు కలిగిన లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అనుచిత లబ్ధి పొందుతూ ఉంటారని తెలిపారు,ఇంకా విచారణ కొనసాగుతోందని ఇందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు, భూ దందాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు,ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్, బద్వేలు అర్బన్ ఇన్స్పెక్టర్  వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ లు వెంకటరమణ, శ్రీకాంత్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

 

Tags: Fake stamps, degree three cents seized degree books

Leave A Reply

Your email address will not be published.